Begin typing your search above and press return to search.
మరోసారి పోలీస్ కస్టడిలోకి శిల్పా చౌదరి..
By: Tupaki Desk | 6 Dec 2021 10:30 AM GMTకిట్టి పార్టీల పార్టీతో కోట్ల కుంభకోణానికి పాల్పడిన శిల్పా చౌదరి అక్రమాలు రోజుకొకటి భయటపడుతున్నారు. కోట్ల రూపాయలు మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ కు దారులు పడుతుండడంతో ఆమెను లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల కస్టడి పూర్తయిన శిల్పాశెట్టిని మరో వ్యక్తి ఫిర్యాదుతో ఆమెను మరోసారి కస్టడిలోకి తీసుకున్నారు.
బాధితుల్లో సినిమాకు సంబంధించిన సెలబ్రెటీలు కూడా ఉండడంతో ఈకేసు విషయంలో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తాజాగా ఆమె ఫోన్ నెంబర్ల ఆధారం పలు కీలక విషయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
తమ దగ్గర పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపిన శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ లు పలువురి దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారు. కొందరికి అనుకున్న సమయానికి డబ్బు ఇచ్చినా.. మరికొందరికి మాత్రం పట్టించుకోలేదు. దీంతో వారంతా తమ డబ్బు ఇవ్వమని అడగగా బౌన్సర్లతో బెదిరించేందని కొందరు వాపోయారు.
అయితే ఓ మహిళ నార్సింగి పోలీసులకు పిర్యాదు చేయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. ఆ తరువాత ఒక్కొక్కరు బాధితులు పలు పోలీస్ స్టేషన్లలో తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఇప్పటికే పోలీస్ కస్టడికి తీసుకున్న ఆమెను పలు కోణాల్లో విచారించారు. ముందుగా తనకేం తెలియదని, తాను కొంతమందికి డబ్బు ఇచ్చానని.. వారు ఇవ్వకపోవడంతో తనకు ఇచ్చినవారికి ఇవ్వలేకపోయానని తెలిపింది. అయితే పోలీసులు కొంచె గట్టిగా అడిగే సరికి పలువురి దగ్గర కొట్ల రూపాయలు తీసుకున్న మాట వాస్తమేనని అంగీకరించింది.
ఇప్పటికే ఆమెపై పదుల కొద్దీ కేసులు నమోదయ్యాయి. వీరంతా కోట్ల రూపాయల డబ్బును శిల్పాచౌదరికి అందించినవారే ఉన్నారు. దీంతో పోలీసులు ఆమెను మరోసారి కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు.
అయితే వసూలు చేసిన కొట్ల రూపాయలు వారేం చేశారు..? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. కానీ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం.. తమ మోసం ఎన్నిటికైనా బయటపడుతుందని ఆలోచించిన వారు డబ్బును హవాలా రూపంలో విదేశాలకు తరలించారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే శిల్పా అకౌంట్ ను చెక్ చేస్తే మొత్తంగా ఆమె బ్యాంకు అకౌంట్లన్నీ కలిపి లక్షరూపాయలు ఉన్నాయి. అయినా ఆమెకు సంబంధించిన అకౌంటన్లీ ఫ్రీజ్ చేశారు. దీంతో వసూలు చేసిన డబ్బును ఏం చేశారు..? ఎక్కడ పెట్టారు..? అని విచారిస్తున్నారు.