Begin typing your search above and press return to search.
జగన్ అడ్డాలో చేరిన శిల్పా అండ్ కో
By: Tupaki Desk | 14 Jun 2017 6:44 AM GMTఅనుకున్నదే జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాకిస్తూ.. కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గంలోని కీలక నేత శిల్పా మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం (బుధవారం) పదకొండున్నర గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని జగన్ ఇంటికి భారీ ఎత్తున అనుచరగణంతో చేరుకున్న శిల్పా.. పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శిల్పాను అప్యాయంగా హత్తుకొని మరీ.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్.
శిల్పాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పిన జగన్.. ఆయనకు.. ఆయనతో పాటు పార్టీలో చేరేందుకు వచ్చిన ముఖ్యులకు స్వాగతం పలికారు. శిల్పా మోహన్ రెడ్డితో పాటు నంద్యాల ఛైర్ పర్సన్ సులోచన.. మార్క్ ఫెడ్ నాగిరెడ్డి.. పలువురు జెడ్పీటీసీలు.. ఎంపీటీసీలు కూడా జగన్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శిల్పా.. తాను ఉప ఎన్నికల్లో టికెట్ కోసం పార్టీ మారలేదని.. మూడేళ్లుగా తాను పడుతున్న అవమానాలకు ప్రతిగా చేరినట్లుగా చెప్పారు. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఇబ్బందులు వచ్చినా తాను పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. జగన్ నాయకత్వంతో కర్నూలు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను పార్టీలో చేరినట్లుగా శిల్పా చెప్పారు. ఆహ్లాద వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు.. అధికారపార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు విపక్షంలోకి వెళ్లటం.. ఆయనతో పాటు పలువురు నేతలు పార్టీ మారటంపై ఏపీ అధికారపక్షానికి షాకింగ్ గా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/