Begin typing your search above and press return to search.
బాబుకు శిల్పా పంచ్ పడనుందా?
By: Tupaki Desk | 10 April 2017 1:55 PM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టైం ఏమాత్రం బాగున్నట్లుగా లేదు. ఆయనే మాత్రం ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఏళ్లకు ఏళ్లుగా మురగేసి.. మురగేసి మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమాన్ని శుభమా అని స్టార్ట్ చేస్తే.. అదెంత రచ్చగా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. విస్తరణ అనంతరం అసంతృప్తులు చెలరేగిపోయిన తీరు.. చివరకు చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి కొందరిని బుజ్జగించినా.. వారు సంతృప్తి పడింది అంతంతమాత్రమేనన్న విషయాన్ని మార్చిపోకూడదు.విస్తరణ షాక్ నుంచి బాబు ఇంకా కోలుకోక ముందే.. మరో షాక్ ఆయనకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
దివంగత భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక వ్యవహారం తెలుగు తమ్ముళ్లల్లో కొత్త గుబులు పుట్టేలా చేస్తోంది. ఎందుకంటే.. ఉప ఎన్నికల బరిలోకి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి దిగాలన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంపై రహస్యంగా ఆయన తన అనుచరులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. అధినేత తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా.. తాను ఉప ఎన్నికల బరిలో దిగటం ఖాయమని చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే.. టీడీపీ అభ్యర్థిగా కాదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దిగేందుకు సైతం సిద్ధమన్నట్లు చెప్పారని.. అదీ కుదరదంటే.. ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగటం పక్కా అని ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ఒకవేళ.. శిల్పా మోహన్ రెడ్డి కానీ టికెట్ విషయంలో పట్టుబట్టి.. తాను అనుకున్నదే చేస్తే మాత్రం అధినేత చంద్రబాబుకు భారీ షాక్ అన్నది ఖాయం.
ఇదిలా ఉంటే.. శిల్పా వైరి వర్గమైన ఎండీ ఫరూక్ ఈ ఇష్యూ మీద మరోలా రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ అధినేత కానీ శిల్పాకు టికెట్ కేటాయిస్తే.. ఆయన్ను ఓడించేందుకు పోరాడతామని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో టికెట్ భూమా కుటుంబానికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ.. వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/