Begin typing your search above and press return to search.
15 ఏళ్ల నాటి ముద్దు కేసు.. శిల్పాశెట్టి నిందితురాలు కాదు.. బాధితురాలే..
By: Tupaki Desk | 26 Jan 2022 3:43 AM GMTబాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టిని 15 ఏళ్లుగా వెంటాడుతున్న ఓ ముద్దు కేసు నుంచి ఎట్టకేలకు బయటపడింది. ఆమెపై నమోదైన కేసును కోర్టు ఇన్నాళ్లకు కొట్టివేయడం విశేషం. అందులో శిల్పాశెట్టిని నిందితురాలిగా చేర్చగా.. బాధితురాలని తేల్చారు. దీంతో శిల్పాశెట్టికి పెద్ద ఊరట లభించినట్టైంది.
ఇప్పటికే శిల్పా శెట్టి భర్త గత ఏడాది జైలుకు వెళ్లడం.. తర్వాత తల్లిపై కేసు నమోదవ్వడం.. వంటి సంఘటనలతో ప్రస్తుతం డిస్టబ్ గా ఉంది. ఇలాంటి సమయంలో ఆమెపై పెట్టిన పాత కేసు విచారణకు వచ్చింది. అందులో ఆమె తప్పేమీ లేదని కోర్టు కొట్టివేయడంతో శిల్పాకు గొప్ప ఊరట దక్కింది.
-ఏమిటీ ముద్దు కేసు?
2007 ఏప్రిల్ 15న రాజస్థాన్ లో ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ సేవలందిస్తున్న హాలీవుడ్ హీరో రిచర్డ్ గెరెను దీనికి ఆహ్వానించారు. ప్రత్యేక అతిథిగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని పిలిచారు. ఈ కార్యక్రమంలో శిల్పా అందానికి ఫిదా అయిన రిచర్డ్ గెరె వేదికపైనే గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అది చూసి అక్కడున్న వారే కాదు.. టీవీల్లో, పత్రికల్లో చూసిన వారు షాక్ అయ్యారు.
అసలు వివాదం ఏంటంటే.. రిచర్డ్ గెరె బలవంతంగా ముద్దు పెడుతున్నప్పుడు ఆమె ప్రతిఘటించలేదని శిల్పా ప్రధాన ఆరోపణ. బహిరంగంగా అలా ప్రవర్తించడం తప్పని వారణాసి, ఢిల్లీ, కాన్పూర్, ముంబై నగరాలతో సహా పలు చోట్ల నిరసనలు కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అప్పటి నుంచి 15 ఏళ్లుగా కేసు విచారణ సాగుతోంది. శిల్పా ఈ కేసులను ముంబై కోర్టుకు బదిలీ చేసుకుంది.
ఇటీవల ముంబై కోర్టు శిల్పాశెట్టి ఈ కేసులో నిందితురాలు కాదని.. బాధితురాలని తేల్చిచెప్పింది. ఆమెపై వచ్చిన ఫిర్యాదులను నిరాధారమైనదిగా పేర్కొంది. రిచర్డ్ గెరె ముద్దు పెట్టగానే శిల్పాశెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది. కాబట్టి ఆమె తప్పు ఏమీ లేదని తేల్చి కొట్టివేసింది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరెను నిందితుడిగా పేర్కొంది. కానీ రిచర్డ్ అప్పట్లోనే సారీ చెప్పాడు. కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్న రిచర్డ్ ను విచారించడం అసాధ్యం. చూడాలి మరీ ఈ అంతర్జాతీయ కేసులో ఏం తేలనుందో.?