Begin typing your search above and press return to search.
సెంటిమెంట్ వర్క్ ఆవుట్ అయితే బీజేపీకే పగ్గాలు
By: Tupaki Desk | 15 May 2018 11:05 AM GMTరంగం ఏదైనా.. సెంటిమెంట్లు అందరిలోనూ ఎక్కువగానే కనిపిస్తుంటాయి. రాజకీయ.. సినిమారంగంలో సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తారు. కర్ణాటక ఎన్నికల్లోనూ మొదట్నించి ఒక సెంటిమెంట్ గురించి తరచూ ప్రస్తావిస్తారు. ఆ రాష్ట్రంలోని షిరహట్టి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీదే అధికారంగా తేలుస్తారు.
ఈ సెంటిమెంట్ ఈ మధ్యన కాదు.. దాదాపు 1971 నుంచి ఇదే సెంటిమెంట్ వర్క్ ఆవుట్ అవుతోంది. తాజా ఎన్నికల్లోనూ షిరహట్టి సెంటిమెంట్ ఎంతమేరకు వర్క్ వుట్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. షిరహట్టిలో బీజేపీ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ రిజర్వ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామప్ప విజయం సాధించారు.
ఇక్కడి సెంటిమెంట్ ప్రకారం బీజేపీనే అధికారాన్ని చేపట్టాలి. కానీ.. ఇప్పుడున్న పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మేజిక్ ఫిగర్ కు కాస్త దూరంగా 104 స్థానాల వద్ద బీజేపీ సీట్ల సాధన ఆగింది. దీంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో తొమ్మిది స్థానాలు అవసరమైన పరిస్థితి.
మరోవైపు.. కర్ణాటకలో అధికారాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా కాంగ్రెస్.. జేడీఎస్ లు ఉమ్మడిగా ప్రయత్నాలు షురూ అయ్యాయి. జేడీఎస్ కు తాము బయట నుంచి మద్దతు ఇస్తామని.. ఇందుకు తాము ఎలాంటి కండీషన్లు పెట్టమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది సీఎం పదవిని సైతం కుమారస్వామికి చేపట్టేందుకు ఆ పార్టీ సిద్ధం అంటోంది. ఈ నేపథ్యంలో ఎవరు పగ్గాలు చేపడతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. షిరహట్టి సెంటిమెంట్ ప్రకారమైతే బీజేపీ చేతుల్లోకి అధికారిక పగ్గాలు రావాలి. దశాబ్దాలుగా సాగుతున్న సెంటిమెంట్‌కు తాజా ఎన్నికలు బ్రేక్ ఇస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.