Begin typing your search above and press return to search.
కరోనాపై సాయానికి కోటి రూపాయలు డొనేట్ చేసిన నిర్మాత!
By: Tupaki Desk | 17 April 2020 2:29 PM GMTప్రపంచ దేశాలను కరోనా తీవ్ర సంక్షోభంలో నెట్టేసింది. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. మానవ జాతికి సవాల్ విసురుతున్న ఈ మహమ్మారి వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశ ప్రజలను ఆదుకోవడంతో పాటు - కరోనా ప్రభావం వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు నానా అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఇక కరోనా మహమ్మారి పై పోరాటంలో భాగంగా తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం ఓం నమో వేంకటేశాయ ఫిల్మ్స్ అధినేత ‘శిరిడి సాయి’ సినిమా నిర్మాత మరియు ఏఎమ్ ఆర్ గ్రూప్ చైర్మన్ ‘మహేష్ రెడ్డి’ ముందుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయిలను విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణకు ప్రకటించిన ఫండ్ ను కేటీఆర్ ను కలిసి చెక్ రూపంలో అందజేశారు. కాగా కరోనా వ్యాప్తి నిరోధం విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అహర్నిశలూ కృషి చేస్తున్నాయి. ప్రభుత్వాల సలహాలు - సూచనలు ప్రజలందరూ తప్పకుండా పాటించాలని మహేష్ రెడ్డి కోరుతున్నారు. ఇక ప్రజలు కూడా ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలని అందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు.
మరోవైపు కరోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. ఇప్పటికే ఈ ఛారిటీ ద్వారా పేద సినీ కార్మికులకు సాయం చేయడం మొదలు పెట్టేసారు.