Begin typing your search above and press return to search.
షిర్డీ ఆలయంలో ఇంతటి దారుణ స్థితి!?
By: Tupaki Desk | 24 Jun 2020 1:30 AM GMTకరోనా కారణంగా ప్రపంచంలోని దేశాలకు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే అనేక వ్యాపార సంస్థలు, పరిశ్రమలు లాక్ డౌన్ తో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి. ఆలయాలు కూడా మూతపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున ఆదాయాన్ని తిరుమల, షిర్డీ సహా దేశంలోని ప్రముఖ ఆలయాలు కోల్పోయాయి.
ప్రతీఏటా రూ.400 కోట్ల ఆదాయం పొందే షిర్డీ ఆలయ ట్రస్ట్ కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటోంది. ఎంతలా అంటే తన ఆలయ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితికి దిగజారింది. మూడు నెలలుగా లాక్ డౌన్ తో ఆలయం మూతపడడం.. భక్తుల రాక లేకపోవడంతో ఆలయానికి ఆదాయం లేకుండా పోయింది. విరాళాలు కూడా రాకపోవడంతో రోజుకు రూ.1.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తిరుమల వెంకన్న తర్వాత అంతటి సంపన్న ట్రస్ట్ షిర్డీనే. ఇప్పుడు నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించలేని పరిస్థితికి దిగజారింది.
తాజాగా ఆర్థిక సంక్షోభం కారణంగా షిర్డీ ఆలయ ఉద్యోగులకు ప్రతీనెల 5వ తేదీన పడాల్సిన జీతాలు కూడా చేతికి అందలేదట.. ఈసారి 20వ తేదీ దాటినా ఇంకా జీతాలు చెల్లించకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు.
ఆలయానికి వచ్చే విరాళాలను ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. లాక్ డౌన్ తో ఆదాయం లేక డిపాజిట్ల నుంచి తీయలేక.. బయట నుంచి రాక ఖాతాల్లో ఉన్న కనీస మొత్తాలు మే నెల వరకే జీతాలకు ఖర్చు అయ్యిపోయాయి. దీంతో ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.