Begin typing your search above and press return to search.
పంజాబ్ లో ఆ పార్టీ మాటే శిరోధార్యం...?
By: Tupaki Desk | 18 Jan 2022 10:12 AM GMTఅధికారంలో ఎవరు రావాలీ అంటే మొదట జనాలు డిసైడ్ చేయాలి. కొన్ని సార్లు జనాలు కూడా అస్పష్టమైన తీర్పు ఇస్తూంటారు. పోటీ పోటీగా పార్టీలు సీన్ లో ఉన్నపుడో. లేక అధికార పార్టీ మీద పూర్తి వ్యతిరేకత రానప్పుడో జనాలు ఎటూ తేల్చుకోలేరు. అలాంటి సమయంలో వారు అటూ ఇటూ ఓటేస్తారు. ఈ సందర్భంలోనే ఏ పార్టీకి మెజారిటీ రాని సీన్ ఏర్పడుతుంది. ప్రస్తుతం పంజాబ్ లో పొలిటికల్ సినారియో చూస్తూంటే హంగ్ అసెంబ్లీ వస్తుంది అంటున్నారు.
పంజాబ్ లో మొత్తం సీట్లు 117 ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ఈసారి గెలుపు కష్టమే అని ఒక వైపు సర్వేలు చెబుతున్నా కూడా ఆ పార్టీ ఏమీ తక్కువ తినలేదు. గట్టిగానే పోటీలో ఉంది. యాభై స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ గెలుచుకుంటుంది అని అంటున్నారు.
మరో వైపు కొత్తగా అక్కడ బలపడుతున్న పార్టీ ఆప్. ఆప్ కి నిజానికి పునాది రాయి పడింది 2014లో. నాటి నుంచి అలా ఎదుగుతూ వస్తోంది. ఇపుడు చూస్తే ఆప్ పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాకా దూసుకుపోతోంది. అయితే ఆప్ కి కూడా మెజారిటీకి రావాల్సిన మ్యాజిక్ నంబర్ 59 సీట్లు రావడం కష్టమే అని అంటున్నారు. ఆప్ కూడా యాభై దాకానే సీట్లు సాధిస్తుంది అని అంటున్నారు.
ఈ సమయంలో అత్యంత కీలకంగా మూడవ పార్టీ శిరోమణీ అకాళీదళ్ ఉంటుంది అంటున్నారు. ఒకపుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చలాయించిన అకాలీదళ్ కి మళ్ళీ మంచి రోజులే వస్తున్నాయి అనుకోవాలి. బీజేపీతో విడిపోయాక అకాలీదళ్ దూకుడు తగ్గింది. దాంతో వచ్చే ఎన్నికల్లో కనాకష్టంగా పది సీట్ల దాకా రావచ్చు అంటున్నారు. అయితే ఆ సీట్లే రేపటి రోజున అక్కడ ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేయలంటే కీలకం అవుతాయని చెబుతున్నారు.
హంగ్ అసెంబ్లీ కనుక వస్తే శిరోమణీ అకాలీదళ్ మాటే ఏ పార్టీకైనా శిరోధార్యమే అవుతుంది అని అంటున్నారు. కేవలం పది సీట్లతో అకాళీదళ్ గెలిచినా చాలు అటు కాంగ్రెస్ కానీ ఇటు ఆప్ కానీ ఆ పార్టీ చుట్టూనే తిరగాల్సి ఉంటుంది. అయితే అకాళీదళ్ కి ఆ చాన్స్ ఇవ్వకుండా తానే కింగ్ మేకర్ కావాలని రీసెంట్ గా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా చూస్తున్నారు.
ఆయన పార్టీ రేసులో ఉన్నా అంత సీన్ ఉందా అన్నదే చూడాలి. ఏది ఏమైనా ఏ పార్టీకి మెజారిటీ రాని సీన్ అయితే ఇపుడు పంజాబ్ లో ఉంది. మరి ఎన్నికల నాటికి ఆప్ స్పీడ్ పెరిగితే మాత్రం పూర్తి ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేయవచ్చు అంటున్నారు. ఆ ధీమాతోనే ఆప్ తన సీఎం క్యాండిడేట్ గా భగవంత్ మాన్ ని ప్రకటించింది. రెండు సార్లు ఎంపీగా గెలిచిన మాన్ కి ప్రజలల్లో ఆదరణ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.