Begin typing your search above and press return to search.

ఎటూ తేల‌ని 'మ‌హా' రాజ‌కీయం..అధికారం కోసం పోటాపోటీ

By:  Tupaki Desk   |   3 Nov 2019 9:49 AM GMT
ఎటూ తేల‌ని మ‌హా రాజ‌కీయం..అధికారం కోసం పోటాపోటీ
X
ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి స‌రైన మెజారిటీ రాక‌పోవ‌డంతో మ‌హారాష్ట్ర రాజ‌కీయం ఇప్ప‌టి వ‌ర‌కు ముడి ప‌డ‌లేదు. నాయ‌కులు - పార్టీలు ఎవ‌రికివారే.. అధికార పీఠం కోసం కుస్తీ ప‌డుతున్నారు. మొత్తం 288 సీట్లున్న మ‌హా అసెంబ్లీలో అధికారం చేప‌ట్టేందుకు 145 మంది మ‌ద్ద‌తు అవ‌స‌రం. అయితే - బీజేపీకి 105 మాత్ర‌మే సీట్లు ద‌క్కాయి. దీంతో సొంతంగానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన క‌మ‌ల నాధులు ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేయాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక‌, బీజేపీ మిత్ర ప‌క్షం శివ‌సేనకు ఈ ఎన్నిక‌ల్లో 56 సీట్లు ల‌బించాయి.

అయితే, గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ-శివ‌సేన మిత్ర ప‌క్షంగా పోటీ చేసి విజ‌యం సాధించి అధికారం చేప‌ట్టిన ప‌రి స్థితి నుంచి ఇప్పుడు మిత్ర‌ప‌క్షం గానే ఎన్నిక‌ల‌కు వెల్లినా.. అధికారం విష‌యంలో మాత్రం బీజేపీకి సీట్లు త గ్గ‌డం శివ‌సేన‌కు సీట్లు పెర‌గ‌డంతో ఇప్పుడు సీఎం సీటు విష‌యంలో ఇరు పార్టీ ల‌మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అదే స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వుల విష‌యంలోనూ నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల కొంది. సీఎం సీటును రెండున్న‌రేళ్లు చొప్పున పంచుకోవాల‌ని - మిగిలిన సీట్ల‌ను - ప‌ద‌వుల‌ను కూడా 50:50 ప‌ద్ద‌తిలో పంచుకోవాల‌ని శివ‌సేన చేసిన డిమాండ్‌ ను బీజేపీ తోసిపుచ్చింది.

దీంతో ఈ రెండు పార్టీల పొత్తుపై ఇంకా సందిగ్దం కొన‌సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన అడుగులు వేడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పా టుపై శివసేన ముఖ్య నేత -ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. తాము తలచుకుంటే బీజేపీ అవసరం లేకుండా రేపటిలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమకు 175 ఎమ్మెల్యే మద్దతు ఉందంటూ కొత్త ట్విస్ట్‌ కు తెరలేపారు. రౌత్‌ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో బీజేపీ నేతలు అప్రమత్తయ్యారు.

అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్న ఎన్సీపీ తన రూటు మార్చుకుంటుందా ? అన్న చ ర్చ మరాఠా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ - శివ‌సేన‌ - ప‌వార్‌ క‌లిసి అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఈ ప్ర‌య‌త్నం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టాలెక్క‌లేదు. మ‌రోప‌క్క‌ - ఈ నెల 7 నాటికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌క‌పోతే.. రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల్సి ఉంటుంద‌ని బీజేపీ ఇప్ప‌టికే హెచ్చరించిన నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందోన‌ని ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా.. మ‌హారాష్ట్ర రాజ‌కీయం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.