Begin typing your search above and press return to search.
మిత్రుడి నోట ముచ్చెమటలు పోయించే మాట
By: Tupaki Desk | 28 March 2016 12:33 PM GMTరాజకీయ ప్రత్యర్థుల విషయంలో అలెర్ట్ గా ఉండటం మామూలే. కానీ.. మిత్రుల విషయంలోనూ అంతే అలెర్ట్ గా ఉండాల్సిన దుస్థితి బీజేపీకి పట్టింది. పేరుకు ఫ్రెండ్స్ అనే మాటే కానీ.. మిత్రులకు ఏ మాత్రం ప్రత్యేకంగా చూడని మోడీ సర్కారు తీరుతో ఎన్డీయేలోని పలు మిత్రపక్షాలు గుర్రుగా ఉండటం తెలిసిందే. టీడీపీ లాంటి పార్టీలు కక్కాలేక.. మింగాలేక కిందామీదా పడుతుంటాయే తప్పించి మోడీ అండ్ కోను మాట వరుసకు ఒక్క మాట అనేందుకు ఇష్టపడదు. టీడీపీ లానే మిగిలిన మిత్రపక్షాలు ఉండాలన్న రూల్ లేదన్నట్లుగా ఉంటుంది శివసేన తీరు.
పేరుకు మిత్రపక్షమే అయినా.. విపక్షం కంటే ఘాటైన విమర్శలు చేయటం.. మిత్రుడ్ని ఆత్మరక్షణలో పడేసేలా చేయటం శివసేన తర్వాతే ఎవరైనా. తరచూ సూటి ప్రశ్నలు వేసి కమలనాథులకు కంగారు పుట్టించే శివసేన నేతలు తాజాగా ఆ తరహా వ్యాఖ్య చేసి కొత్త చర్చకు తెర తీశారు. జాతీయవాదానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే బీజేపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడే ప్రశ్న ఒకటి సంధించారు.
భారత్ మాతా కీ జై అనని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు.. అదే రీతిలో కాశ్శీర్ లో బీజేపీ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ముఫ్తీ తో అదే నినాదాన్ని అనిపించగలరా? అంటూ శివసేన సూటిగా ప్రశ్నించింది. తాజాగా శివసేన పత్రిక సామ్నాలో ఇందుకు సంబంధించి పలు ప్రశ్నల్ని కమలనాథులకు సంధించింది.
దేశ వ్యతిరేక వ్యాఖ్యలు.. పనులు చేసే వారి పట్ల గతంలో పవర్ లో ఉన్నప్పుడు ముఫ్తీ సర్కారు ఎలాంటి చర్య తీసుకోలేదంటూ గుర్తు చేయటమే కాదు.. ఉగ్రదాడుల్లో అసువులు బాసిన కాశ్శీరీ పండిట్ల గౌరవార్థం ఆమె భారత్ మాతాకీ జై అని నినాదం చేస్తారా? అంటూ ప్రశ్నించింది. ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విషయంలో బీజేపీ నేతలు హ్యాపీగా ఉండొచ్చేమో కానీ దేశం మాత్రం ఆందోళనగా ఉందంటూ మంట పుట్టేలా వ్యాఖ్యలు చేశారు. తమ అవసరానికి తగ్గట్లుగా ఆడుకునే మోడీ లాంటి నాయకులున్నబీజేపీకి అసలుసిసలు మిత్రుడంటే శివసేనే అని చెప్పక తప్పదు.