Begin typing your search above and press return to search.

శ్రుతిమించిన శివసేన... తర్వాత వెనక్కి తగ్గింది!

By:  Tupaki Desk   |   13 April 2015 4:10 AM GMT
శ్రుతిమించిన శివసేన... తర్వాత వెనక్కి తగ్గింది!
X
శివసేన నాయకులు ఏమి చెప్పాలనుకున్నా, ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలనా... ఆ తుపాకీ సామ్నా భుజంపై పెట్టి కాలుస్తుంటారు. మిత్ర పక్షం బీజేపీకి సూచనలు చేయాలన్నా, విమర్శలు చేయాలాన్నా అందుకు వారికున్న మార్గం సామ్నా ఎడిటోరియల్. ముస్లిం నేతలంటే అంతెత్తున లేచి పడే శివసేన తాజాగా మజిల్స్ నేతలపై పడింది. హైదరాబాద్‌ భారతదేశంలో ఉందా? లేక లాహోర్‌ / కరాచీ లేదా పెషావర్‌లో ఉందా? అని ప్రశ్నిస్తోంది శివసేన మానసపుత్రిక సామ్నా! రాజకీయంగా, వారికున్న సిద్దాంతపరంగా చేసే వ్యాఖ్యలు శివసేన... ఈ సారి ఏకంగా శృతి మించి "దేశవ్యాప్తంగా ముస్లిములకు ఓటు హక్కును రద్దు చేయాలని" వ్యాఖ్యలు చేసింది. అలా చెసినప్పుడే దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరపడుతుందని అభిప్రాయపడింది. కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసి వారికి ఓటు హక్కు తీసేస్తే... ఆ మతస్తులు బాగుపడతారు అనే విషయాన్ని దారుణమైన వ్యాఖ్యలుగా పరిగణిస్తుంది కాంగ్రెస్ పార్టీ.
ముస్లిములకు అన్యాయం జరిగిందని, దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేసిన శివసేన... ముస్లిములకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని గతంలో ఓసారి బాల్ థాకరే వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్థావించింది! "హైదరాబాద్‌లో అడుగు పెట్టగలవా?" అంటూ శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించడంపైనే సామ్నా ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. హైదరాబాద్‌ భారతదేశంలో ఉందా? లాహోర్‌ లేదా కరాచీ లేదా పెషావర్‌లో ఉందా? అని సామ్నా ప్రశ్నించింది. అయితే ఈ వ్యాఖ్యలపై... కాంగ్రెస్ మిత్ర పక్షాలు శివసేనపై ముప్పెట దాడి మొదలుపెట్టడంతో కాస్త వెనక్కి తగ్గి... మత రాజకీయాలకు స్వస్తి పలకాలని, అవి ముస్లిములకూ మేలు చేయవని చెప్పడమే సామ్నా ఉద్దేశమం తప్ప, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు శివసేన ఎమ్మెల్యేలు!