Begin typing your search above and press return to search.
మోడీ హత్య కుట్ర... ఓ హరర్ ఫిల్మ్
By: Tupaki Desk | 11 Jun 2018 12:42 PM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ హత్యచేసిన తరహాలోనే ఆత్మాహుతి దాడితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అంతమొందించాలని మావోయిస్టులు కుట్ర పన్నారని సంచలన పరిణామం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో భాగంగా ఈ మేరకు ఓ నిందితుడి ఇంట్లో లభ్యమైన కీలక లేఖను.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జల పవార్ పుణె సెషన్స్ కోర్టుకు సమర్పించారు. గత జనవరిలో జరిగిన భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన హక్కుల కార్యకర్త రోనా విల్సన్ ఇంట్లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సంచలన ఉదంతం తెరమీదకు వచ్చింది. అయితే దీనిపై ఇప్పటికే విపక్షాలు ఘాటుగా స్పందించాయి. ప్రధాని మోడీ హత్యకు కుట్ర జరుగుతున్నదంటూ వచ్చిన కథనాలపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కథనాలు పూర్తిగా అవాస్తవం కాకపోవచ్చు. కానీ, తనకు ప్రజాదరణ తగ్గిన ప్రతిసారీ మోడీ హత్య కుట్ర అంశం తెరమీదకు వస్తుందని వ్యాఖ్యానించింది.
కాగా, ఇటీవల బీజేపీ సంబంధాలు కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్న శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారనడంలో సహేతుకత లేదని, అంతేకాకుండా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ - ఆయన కుటుంబసభ్యులను బెదిరిస్తూ మావోయిస్టులు రెండు లేఖలు రాసిన అంశం కూడా విశ్వసనీయంగా లేదని పేర్కొంది. శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో సంచలన అంశాలను పంచుకుంది. మోడీని చంపే కుట్ర అంశం ఓ హర్రర్ సినిమాను తలపిస్తోందని ఎద్దేవా చేసింది. `మోడీ - ఫడ్నవిస్ లే తమను చంపేందుకు నక్సలైట్లకు సుఫారీ ఇచ్చినట్టు బీజేపీకి చెందిన కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అయితే అలాంటి ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు' అని 'సామ్నా' సంపాదకీయం నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు వీఐపీల భద్రత విషయంలోనూ సామ్నా ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది. విద్రోహుల దాడుల్లో లక్షలాది మంది ప్రజలు చనిపోతుంటారని - వీటితో ప్రమేయం లేకుండానే అత్యున్నత స్థాయి నేతలకు మాత్రం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తుంటారని శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయం విశ్లేషించింది.