Begin typing your search above and press return to search.
మిత్రుడి మీద పులి గాండ్రిపు!
By: Tupaki Desk | 9 Nov 2015 9:06 AM GMTపులి గాండ్రించింది. విమర్శలకు ఉక్కిరిబిక్కిరి చేసింది. గత కొద్దిరోజులుగా బీజేపీ మీద విమర్శలతో విరుచుకుపడుతున్న శివసేన తాజాగా బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమ పత్రిక అయిన సామ్నాలో కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ ఎన్నికల్ని సింఫుల్ గా తీసుకొని దెబ్బ తింటే.. బీహార్ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకొందని.. మోడీ వర్సస్ నితీశ్ అన్నట్లుగా చేసి చతికిలపడిందని వ్యాఖ్యానించింది. రాజకీయ వ్యూహాలు.. భారీ ప్యాకేజీలు ప్రకటించి కూడా 60 సీట్లలో గెలవలేకపోయిందని విమర్శించింది. మోడీ మీద విరుచుకుపడిన సామ్నా.. నితీశ్ మీద మాత్రం ప్రశంసల జల్లు కురిపించింది. నిజాయితీ.. నిరాడంబరం.. లాంటి వాటితో అధికారాన్ని నిలబెట్టుకున్నారని విశ్లేషించింది. ఎన్డీయే మిత్రపక్షాల్ని బీహార్ ఓటర్లు 20 అడుగులు లోతు గొయ్యిలో పాతిపెట్టారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.
బీహార్ విజయం కోసం నితీశ్ అనాగరిక భాషను వాడలేదని.. ధనాన్ని వినియోగించలేదని పేర్కొంది. అంతేకాదు.. బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కొన్ని వ్యాఖ్యలు చేసింది. లౌకిక మహాకూటమి విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ లో టపాసులు పేలాయో తమకు తెలీదంటూ పంచ్ వేసింది. రాజకీయాల్లో వినమ్రత.. అనేది అభరణం కాదని.. ఆత్మరక్షణ ఆయుధంగా బీహార్ ప్రజలు తమ తీర్పుతో స్పష్టం చేశారని పేర్కొంది. పులి గాండ్రిపు కమలనాథులకు మరింత ఆత్మరక్షణలోకి పడేయటం ఖాయంగా చెప్పొచ్చు.