Begin typing your search above and press return to search.

అధికార‌పార్టీకి పంచ్ ఇచ్చిన మిత్ర‌ప‌క్షం

By:  Tupaki Desk   |   24 Jun 2016 4:44 AM GMT
అధికార‌పార్టీకి పంచ్ ఇచ్చిన మిత్ర‌ప‌క్షం
X
అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున యావత్ ప్రపంచమంతా ఆసనం వేస్తే, బీజేపీ మిత్రపక్షమైన శివసేన మాత్రం ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. భారత సంస్కృతిని ప్రతిబింబించే యోగకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారంటూ ప్రశంసిస్తూనే, వాస్తవ సవాళ్లకు యోగ ఎంతమేరకు పరిష్కారం చూపుతుందని ప్రశ్నించింది. శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ మేర‌కు మోడీ ప్ర‌భుత్వ ప్ర‌చార తీరును త‌ప్పుప‌ట్టింది.

ద్రవ్యోల్బణంతో ఆకాశాన్నంటిన ధరలను యోగ దించగలుగుతుందా అని సామ్నా సంపాద‌కీయం నిల‌దీసింది. ‘130 దేశాల్లో యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది. దాదాపు ప్రపంచమంతా ఆసనం వేసింది’ అని ప్రశంసించింది. ‘కానీ ఇప్పుడు కావాల్సింది పాకిస్తాన్‌ ను ఎప్పుడూ ఆసనంలోనే ఉంచడం. అలా ఉంచ‌డం కేవలం ఆయుధాలతోనే సాధ్యం. శాశ్వత శవాసనానికి పాకిస్తాన్ పూర్తిగా అర్హమైనది’ అని వ్యాఖ్యానించింది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు మోడీని వ్యతిరేకించినా, యోగ ఒక శాస్తమ్రని -దాన్ని వ్యతిరేకించకూడదని కూడా శివసేన వ్యాఖ్యానించింది. యోగ ద్వారా ఎంతో సాధించవచ్చునని, కానీ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను యోగ ఎంతమేరకు పరిష్కారం చూపగలదని ప్రశ్నించింది.