Begin typing your search above and press return to search.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఏమందంటే?
By: Tupaki Desk | 24 Nov 2019 6:11 AM GMTపాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి బెంబేలెత్తించిన బీజేపీ సర్కారు.. ఇప్పుడు మహారాష్ట్రపై కూడా పొలిటికల్ స్ట్రైక్ చేసింది. రాత్రికి రాత్రి ప్లాన్ చేసి తెల్లవారే సరికి మహారాష్ట్ర లో బీజేపీ సర్కారును ఏర్పాటు చేసింది. శనివారం మహారాష్ట్ర సీఎంగా శివసేన అధిపతి ఉద్దవ్ ఠాక్రే ప్రమాణం చేస్తారని శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. తెల్లవారేసరికి బీజేపీ సర్కారు ఏర్పాటు అవడంతో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ లు విస్తుపోయాయి. ఈ సందర్భంగా కలిసికట్టుగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల అధిపతులు ముంబైలో సమావేశమై బీజేపీ తీరుపై మండిపడ్డారు.
*అజిత్ పవార్ కు, ఎమ్మెల్యేల కు ప్రజలే బుద్ది చెబుతారు..
ఎన్సీపీ ని చీల్చి బీజేపీ కి మద్దతిచ్చిన అజిత్ పవార్ తోపాటు ఆ ఎమ్మెల్యేల కు ప్రజలే బుద్ది చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. ఎన్సీపీలో అంతర్గత పోరు లేదని స్పష్టం చేశారు. అజిత్ పవార్ తోపాటు వెళ్లిన 11 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు తిరిగి వచ్చారని.. మిగతా వారు వస్తారని శరద్ తెలిపారు.అజిత్ పవార్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్సీపీ నుంచి తొలగిస్తున్నట్టు శరద్ పవార్ తెలిపారు..శాసనసభా పక్ష నేతగా అజిత్ ను తొలగించి ఆయన స్థానంలో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ను నియమిస్తున్నట్టు తెలిపారు. ఫడ్నవీస్ బలనిరూపణలో ఓడిపోతే అజిత్ పాటు ఎన్సీపీ ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో ప్రజలే ఓడిస్తారని శరద్ పవార్ మండిపడ్డారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనకు కలిపి 170 మంది ఎమ్మెల్యేల బలముందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్సీపీ నుంచి గెలిచిన 54 మంది ఎమ్మెల్యేల్లో తన వెంట 49మంది ఉన్నారని తెలిపాడు.
*బీజేపీవి ఫర్జికల్ స్ట్రైక్స్: శివసేన
బీజేపీ మహారాష్ట్ర నకిలీ ఫర్జికల్ స్ట్రైక్స్ చేసిందని శివసేన అధిపతి ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు. చీకటి రాజకీయాలు చేయడం బీజేపీ కి అలవాటున్నారు. ఇది వరకు ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రజల చేతిలో బీజేపీకి శిక్ష తప్పదు అని ఆరోపించారు.
*ప్రజాస్వామ్యాన్ని చంపేసిన బీజేపీ: కాంగ్రెస్
మహారాష్ట్ర లో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కాంట్రాక్టు తీసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. అక్రమమార్గంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. భారత దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయమని విమర్శించింది.
కాగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు స్వయంగా మూడు పార్టీలు కలిసి సుప్రీం కోర్టును శనివారం తలుపుతట్టాయి. బలనిరూపణ గడువును ఒక్కరోజే ఇవ్వాలని బేరాసారాలకు ఆస్కారం ఇవ్వవద్దని పిటీషన్ దాఖలు చేశాయి. దీనిపై ఆదివారం ఉదయం 11.30 గంటలకు సుప్రీం కోర్టు విచారణ జరుపనుంది.