Begin typing your search above and press return to search.

ఆత్మరక్షణలో పడ్డ శివసేన..24 మంది జంపింగ్ కి సిద్ధం

By:  Tupaki Desk   |   1 Nov 2019 10:44 AM GMT
ఆత్మరక్షణలో పడ్డ  శివసేన..24 మంది జంపింగ్ కి సిద్ధం
X
ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతుంది మహారాష్ట్రలో బీజేపీ - శివసేనల పరిస్థితి. బేతాళుడిని తీసుకురావడనికి ఆనాడు ఆ విక్రమార్క మహా రాజు ఎంత కష్ట పడ్డాడో తెలియదు కానీ , నేడు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి - ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడాని అంతకంటే ఎక్కువగానే శ్రమిస్తున్నాయి. దీనితో మహా రాజకీయం మరింత రంజుగా తయారైంది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో బీజేపీ - శివసేన కూటమి కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. మెజారిటీ అయితే సంపాదించారు కానీ సీఎం కుర్చీకోసం కుమ్ములాట స్టార్ట్ చేసారు. దీనితో ఎన్నికల ఫలితాలు వచ్చి వారం దాటిపోతున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోతున్నాయి.

శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడం ..బీజేపీ దానికి ససేమిరా అనడం తో అసలు రచ్చ మొదలైంది. దీనితో బీజేపీ కి షాక్ ఇవ్వడానికి శివసేన అధినేత సిద్ధమైయ్యారు. తొలిసారిగా ఎన్‌సీపీ అధినేత శరత్ పవార్‌ తో మంతనాలు ప్రారంభించారు. బీజేపీతో బంధం తెంచుకుని శివసేన బయటకు వస్తేనే విషయం ముందుకు కదులుతుందని చెప్పినట్లు సమాచారం. రుగుతున్న పరిణామాలపై ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ సమీక్ష జరిపాయి. ఒకవేళ శివసేన గనక మద్దతు కోరితే ఏం చెయ్యాలన్న దానిపై ఈ రెండు పార్టీలు చర్చలు జరిపాయి.

సేనకు మద్దతిచ్చే విషయంలో మొదట కాంగ్రెస్‌ హైకమాండ్‌ అనుమతి, ఆలోచన తీసుకొని నా దగ్గరకు రండి అని చెప్పినట్లు తెలుస్తుంది. దీనితో వెంటనే కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టానం తో చర్చలు జరుపుతున్నారు. అలాగే శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండే మళ్లీ ఎన్నికయ్యారు. అధికారాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న తమ డిమాండ్‌పై వెనక్కు తగ్గలేదని కూడా శివసేన స్పష్టం చేసింది. ఆలా చేయకపోతే ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ తో కలిసి వెళ్తామని చెప్పకనే చెప్తుంది. కానీ , ఇక్కడే శివసేన కి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. బీజేపీతో తెగతెంపులు చేసుకుని అధికారాన్ని వద్దనుకుంటే బీజేపీ శిబిరంలోకి దూకేయడానికి 24 మంది శివసేన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.