Begin typing your search above and press return to search.
మోడీకి శివసేన తాజా డిమాండ్ ఇదే..
By: Tupaki Desk | 1 May 2019 7:16 AM GMTశ్రీలంకలో ఐఎస్ఐఎస్ మానవబాంబులతో విరుచుకుపడడం..300మంది దాకా చనిపోవడం.. బుర్ఖాలతోనే తీవ్రవాదులు తప్పించుకుంటున్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు బుర్ఖాను ఆ దేశంలో శాశ్వతంగా నిషేధించింది లంక ప్రభుత్వం. ఇప్పుడు లంక నిర్ణయాన్ని కూడా మహారాష్ట్రకు చెందిన శివసేన అందిపుచ్చుకుంది. భారత్ లోనూ బుర్ఖాను నిషేధించాలని.. లంకను ఫాలో అవ్వాలని మోడీకి తాజాగా శివసేన అల్టీమేటం జారీ చేసింది.
ట్రిపుల్ తలాక్ ను ఇప్పటికే బీజేపీ నిషేధించింది. ఇప్పుడు బుర్ఖాను కూడా నిషేధించాలని శివసేన కొత్త వాదన తీసుకురావడం సంచలనంగా మారింది. రావణుడు పాలించిన శ్రీలంకలోనే బుర్ఖాను నిషేధించారని.. రాముడు పాలించిన భారత్ లో ఎందుకు నిషేధం విధించరని బీజేపీని శివసేన ప్రశ్నించింది. ఉగ్రవాద దాడులను నివారించడానికి శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. దేశంలోనూ ప్రభుత్వ ప్రదేశాలు, ప్రైవేటు సంస్థల్లో ముఖాలపై ముసుగులను, బుర్ఖాలను నిషేధించాలని తాజాగా శివసేన డిమాండ్ చేసింది.
శివసేన హిందూసేన తాజాగా బీజేపీకి లేఖ రాసింది. ఉగ్రదాడులను అరికట్టడానికి బుర్ఖాల నిషేధమే తొలి అడుగు అని పేర్కొంది. దేశంలోని ప్రభుత్వ - ప్రైవేటు - బయటి ప్రాంతాల్లో బుర్ఖాలను నిషేధించండి.. ముసుగుల వల్ల సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా చర్యల నుంచి ఉగ్రవాదులు తప్పించుకుంటున్నారు అని శివసేన పేర్కొంది.
అయితే దేశంలో ఎన్నికలు జరుగుతుండడం.. శివసేన ఈ డిమాండ్ చేయడంతో బీజేపీ ఇరుకునపడింది. ఇప్పటికే ముస్లింలకు దూరమైన ఆ పార్టీ.. శివసేన డిమాండ్ పర్యవసనాలతో మరింత చిక్కుల్లో పడింది. ఎటూ స్పందించని పరిస్థితుల్లో ఉంది. మిత్రపక్షం శివసేన డిమాండ్ బీజేపీని తీవ్ర ఇరకాటంలో పడేసింది.