Begin typing your search above and press return to search.
శివసేనకు షాకిచ్చిన బీజేపీ
By: Tupaki Desk | 17 Nov 2019 5:33 AM GMTమహారాష్ట్ర సీఎం కుర్చీలాటలో శివసేన-బీజేపీ బంధానికి బీటలు వారింది. సీఎం కుర్చీ కావాలని ఎన్నో ఏళ్ల బంధాన్ని శివసేన తెంచేసుకుంది. ఇప్పుడు మిత్రులైన ఈ రెండు పక్షాలు శత్రువులై విమర్శలు మొదలుపెట్టాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నుంచి కూడా శివసేన వైదొలిగింది. కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యింది.
శివసేన ఒంటరిగా.. తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలవడంతో బీజేపీ కూడా ధీటుగానే స్పందిస్తోంది. శివసేన ఎన్డీఏ నుంచి వైదొలగడంతో పార్లమెంట్ లో అధికార - విపక్షాల సీట్లలో స్వల్పమార్పులు చేసింది. లోక్ సభ - రాజ్యసభలో అధికారపక్షం ఉన్న శివసేన సీట్లను తాజాగా విపక్షంలోకి మార్చింది. విపక్షాలు కూర్చునే ఐదో వరుసలో వారికి సీట్లను కేటాయించింది.
పార్లమెంట్లో మార్పులతో బీజేపీ ఇక శివసేన పార్టీతో దోస్తీని పూర్తిగా కటీఫ్ చేసుకున్నట్టైంది. పార్లమెంట్ లో సీటు మార్చి షాక్ ఇచ్చింది. భవిష్యత్తులోనూ శివసేనను నమ్మి ముందుకెళ్లే పరిస్థితి బీజేపీకి లేకుండా పోయింది.
కాగా శివసేన మాత్రం మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక బీజేపీతో తమ బంధం తెగిపోయినట్టేనని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు.