Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వ్యూహంలో శివసేన.. మహా రాజకీయాలలో మహా ట్విస్ట్ ..

By:  Tupaki Desk   |   11 Nov 2019 5:55 AM GMT
కాంగ్రెస్ వ్యూహంలో శివసేన.. మహా రాజకీయాలలో మహా ట్విస్ట్ ..
X
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎవరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎన్నికల బరిలో మాత్రం ..శివసేన -బీజేపీ ఒక కూటమిగా పోటీ చేసాయి. కానీ , ఆ తరువాత అనూహ్య పరిణామాల మధ్య సీఎం పదవి కోసం జరిగిన కుమ్ములాటలో శివసేన , బీజేపీ నుండి బయటకి వచ్చి .. కాంగ్రెస్ , ఎన్సీపీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యింది.

సీఎం పదవిని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని శివసేన కాంగ్రెస్ , ఎన్సీపీ డిమాండ్ మేరకు బీజేపీతో ఉన్న సంబంధం పూర్తిగా తెంచుకొని బయటకి వచ్చింది. వర్నర్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసే లోగా తాము ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్న విషయాన్ని నివేదించేందుకు వేగంగా శివసేన నిర్ణయాలు తీసుకుంటోంది.

దీనితో కాంగ్రెస్ మాత్రం బయట నుండి మద్దతిస్తారనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రి అవ్వాలంటే, అందుకు థాక్రేకు సీఎం పదవి..శరద్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి..కాంగ్రెస్ కు స్పీకర్ పదవి ఇవ్వాలని ఒక ప్రతిపాదన వచ్చింది. దీనిపై ఎన్సీపీ , కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇదే సమయంలో..శివసేన..ఎన్సీపీ కలిసి తీసుకొనే నిర్ణయం మేరకు కాంగ్రెస్ నడుచుకొనే పరిస్థితి కనిపిస్తోంది.

శివసేన..ఎన్సీపీ రెండు మరాఠా పార్టీలు కావటంతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ బయట నుండి మద్దతివ్వటం రెండో ప్రతిపాదన. దీనిపై పూర్తిగా చర్చించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం 10 గంటలకు సమావేశం కానుంది అందులో మహారాష్ట్రలో జరిగుతున్న పరిణామాల పైనే చర్చించి..నిర్ణయం తీసుకోనున్నారు. తమ అవసరం శివసేన గుర్తించటంతో..దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు కేబినెట్ మంత్రి పదవులు అడగాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు సమాచారం.