Begin typing your search above and press return to search.
శివసేన.. రెంటి కీ చెడ్డ రేవడి అయినట్టే..!
By: Tupaki Desk | 13 Nov 2019 3:52 AM GMTమహా రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. కేంద్రం లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఎంచక్కా రాష్ట్రపతి పాలన విధించేసింది. తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాకుండా దెబ్బ తిన్నట్టుగా కనిపించిన బీజేపీ, చివరకు ఎవరికీ అవకాశం లేకుండా చేసింది.
ఇక ఈ ఎపిసోడ్లో శివసేన పరిస్థితే ఇతడి మూకుడు లో పడ్డ మెత్తటి పకోడం లా అయ్యిందని అంటున్నారు పరిశీలకులు. శివసేన అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అన్నట్టుగా మారింది పరిస్థితి. కమలం పార్టీ అధికారాన్ని పంచుతానంటే, శివసేన ముఖ్యమంత్రి పీఠాన్ని పంచమని కోరింది.
బీజేపీ కేంద్రం లో అధికారం లో ఉందనే విషయాన్ని కూడా గ్రహించనట్టు గా శివసేన వ్యవహరించింది. పట్టిన పట్టు పట్టి, తెగే దాకా లాగింది సేన. బీజేపీ కూడా ఎక్కడా తగ్గకుండా లాగడం తో పరిస్థితి ఇంత వరకూ వచ్చింది.
ఇక ఇప్పుడు అంతిమం గా శివసేన సాధించింది ఏమీ లేదని స్పష్టం అవుతోంది. బీజేపీకి ఉన్న అవకాశాలను తక్కువ అంచనా వేసి సేన భంగ పడిందని స్పష్టం అవుతోంది.
ఈ విషయం పై సుప్రీం కోర్టుకు వెళ్లబోతున్నట్టు గా సేన ఒక ప్రకటన అయితే చేసింది. కానీ సుప్రీం కోర్టు లో కూడా సేన పప్పులు ఎంత వరకూ ఉడుకుతాయనేది చెప్పలేం.
బీజేపీ తో పొత్తు తో ఉండి ఉంటే, బెదిరించో, బతిమాలో అధికారాన్ని అనుభవించే వారు, శివసేన ఎంపీ కేంద్రమంత్రి పదవికి కూడా రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. ఇలాంటి నేపథ్యం లో ఈ మరాఠా సేన తదుపరి ప్రస్థానం ఎలా ఉండబోతోందో!