Begin typing your search above and press return to search.

లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్‌!... శివ‌సేన‌కా? డీఎంకేకా?

By:  Tupaki Desk   |   9 Jun 2019 8:56 AM GMT
లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్‌!... శివ‌సేన‌కా? డీఎంకేకా?
X
కేంద్రంలో వ‌రుస‌గా రెండో సారి అధికారాన్ని ద‌క్కించుకున్న బీజేపీ త‌న‌దైన వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. విప‌క్షాన్ని ఎన్నిక‌ల్లోనే చిత్తు చేసిన బీజేపీ... స‌భ‌లోనూ త‌న‌కు తిరుగు లేకుండా చూసుకునే క్ర‌మంలో న‌యా వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. క్రితం సారి ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చినప్పుడే ఈ త‌ర‌హా కొత్త వ్యూహానికి రూప‌క‌ల్ప‌న చేసిన బీజేపీ...లోక్ స‌భ‌లో స్పీక‌ర్ ప‌ద‌విని త‌న పార్టీకి చెదిన నేత‌కు క‌ట్ట‌బెట్టి.... డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని విప‌క్షానికి క‌ట్టెబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వ్యూహాన్ని ఇప్పుడు కూడా అమ‌లు చేసేందుకే బీజేపీ సిద్ధం కావ‌డంతో లోక్ స‌భ‌కు తొలిసారి ఎన్నికైన డీఎంకే ఎంపీ, ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ సోద‌రి క‌నిమొళి ఏకంగా డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విలో కూర్చునేందుకు రంగం సిద్ధ‌మైంది.

విప‌క్షం నోరు నొక్కేందుకు బీజేపీ చేస్తున్న య‌త్నాన్ని కాంగ్రెస్ చాలా ప్లాన్డ్ గానే వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో క‌నిమొళికి ఈ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు మెరుగ‌య్యాయ‌ని చెప్పాలి. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... బీజేపీకి చెందిన సుమిత్రా మ‌హాజ‌న్ ను స్పీక‌ర్ ప‌ద‌విలో కూర్చోబెట్టి...విప‌క్ష కూటమిలోని డీఎంకే ఎంపీ తంబీదురైకి డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని అప్ప‌గించింది. ఇప్పుడు కూడా ఇదే ప్లాన్ ను అమ‌లు చేసేందుకు బీజేపీ రెడీ కాగా... కాంగ్రెస్ పార్టీ ఈ అవ‌కాశాన్ని గ‌తంలో కంటే మ‌రింత మెరుగ్గా వినియోగించుకునేందుకు సిద్ధ‌మైపోయింది. విప‌క్ష కూట‌మికి ఆఫ‌ర్ చేసిన డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని డీఎంకేకు అప్ప‌గించేందుకు వ్యూహం సిద్ధం చేసిన కాంగ్రెస్ అందుకు ప్ర‌తిగా డీఎంకే కోటా కింద మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని కోరింద‌ట‌.

ఈ ప్ర‌తిపాద‌న‌కు డీఎంకే ఇప్ప‌టికే ఓకే అన్న‌ట్లుగా కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహం ఇటు అధికార, అటు విప‌క్ష కూట‌ముల‌కు ఇబ్బంది క‌లిగించ‌కున్నా... డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విపై గంపెడాశ‌లు పెట్టుకున్న బీజేపీ మిత్ర‌ప‌క్షం శివ‌సేన‌కు షాక్ త‌గిలింద‌నే చెప్పాలి. లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాగానే... డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని త‌మ‌కు కేటాయించాలి మోదీ ముందు శివ‌సేన ప్ర‌తిపాద‌న పెట్టింది. ఈ ప్ర‌తిపాద‌న‌కు మోదీ అవున‌న‌లేదు. అలాగ‌ని కాద‌ల‌న‌లేదు. శివ‌సేన ప్ర‌తిపాద‌న‌పై అస‌లు దృష్టే సారించ‌న‌ట్టుగా క‌నిపించిన మోదీ.. ఇప్పుడు ఆ ప‌ద‌విని డీఎంకే ఎంపీ క‌నిమొళికి అప్ప‌గించేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే..అంతా అనుకున్న‌ట్టుగానే క‌నిమొళికి ఈ ప‌ద‌వి ద‌క్కితే మాత్రం రికార్డేన‌ని చెప్పాలి. ఇప్ప‌టికే డీఎంకే త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా కొన‌సాగిన ఆమె తాజా ఎన్నిక‌ల్లో తూత్తుకుడి నుంచి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అంటే...లోక్ స‌భ‌కు ఎన్నికైన తొలిసారే డిప్యూటీ స్పీకర్ ప‌ద‌విలో కూర్చోవ‌డ‌మంటే రికార్డే క‌దా. అంతేకాకుండా ఓ కేసులో జైలు శిక్ష కూడా అనుభ‌వించిన క‌నిమొళి... డిప్యూటీ స్పీక‌ర్ అయితే మాత్రం మ‌రింత‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది.