Begin typing your search above and press return to search.
ఆ రెబల్స్ బతికి ఉన్న శవాలు.. వచ్చాక వారిని అక్కడికే పంపిస్తాం: శివసేన తీవ్ర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 27 Jun 2022 1:30 AM GMTరెబల్ ఎమ్మెల్యేలపై శివసేన నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. పిరికివాళ్లే పార్టీని విడిచి వెళ్లారని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే అన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే గుణపాఠం ఇప్పుడు నేర్చుకున్నట్లు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. రెబల్ ఎమ్మెల్యేలను బతికున్న శవాలుగా అభివర్ణించారు. వారిని అక్కడికే పంపిస్తామన్నారు. ముంబయి, పుణె సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెబల్స్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
దహిసర్లో నిర్వహించిన పార్టీ కేడర్ సమావేశంలో మాట్లాడిన సంజయ్ రౌత్.. ప్రస్తుత సంక్షోభం శివసేన పునర్నిర్మాణానికి అవకాశమని అన్నారు. 'ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న గుణపాఠం ఇప్పుడు నేర్చుకున్నాం. గువాహటిలో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు బతికున్న శవాల్లాంటివారు. వారి శరీరాలు ముంబయికి తిరిగిరాగానే నేరుగా అసెంబ్లీకి పోస్టుమార్టం కోసం పంపిస్తాం. వారి ఆత్మలు కూడా చనిపోయాయి' అని శివసేన రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు రౌత్.
రెబల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రే సైతం విమర్శలు గుప్పించారు. కేవలం పిరికివాళ్లే పార్టీని విడిచివెళ్లారన్న ఆయన.. రెబల్ నేతలకు భద్రత కల్పించడమేంటని ప్రశ్నించారు. కశ్మీరీ పండితులకు సీఆర్‌పీఎఫ్ భద్రత అవసరమని.. గుహవాటికి పారిపోయిన వాళ్లకు కాదంటూ ఎక్‌నాథ్ షిండే క్యాంపుపై విమర్శలు గుప్పించారు. ముంబయిలోని కలీనా, శాంటాక్రజ్ ప్రాంతాల్లో శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడిన ఆదిత్య ఠాక్రే.. శివసేన గుర్తును, ప్రజల ప్రేమను రెబల్ నేతలు తీసుకెళ్లలేరంటూ వ్యాఖ్యానించారు.
శివసేన కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఠాక్రే.. ద్రోహులకు పార్టీలో స్థానం ఉండదని అన్నారు. 'మనం చేసింది తప్పని, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వానిది తప్పని భావిస్తే మనందరిదీ తప్పే. అటువంటప్పుడు పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయండి. అందుకు మేము కూడా సిద్ధమే' అని కార్యకర్తల సమావేశంలోనూ ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు.