Begin typing your search above and press return to search.
ఆమిర్ ను కొట్టండి..దేశభక్తిని చాటుకోండి
By: Tupaki Desk | 26 Nov 2015 7:56 AM GMTదేశభక్తి....ప్రాంతీయవాదం....హిందూత్వం ఈ మూడు ఏ పార్టీ నినాదాలు అంటే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మహారాష్ర్టలోని శివసేన గుర్తుకు వచ్చేస్తుంది. ఈ మూడు విషయాలకు ఇండియాలో ఎక్కడైనా భంగం వాటిల్లుతోందంటే చాలు శివ సైనికులు విరుచుకు పడతారు. వారి నిరసన తట్టుకోవడం చాలా కష్టమైన పనే. సుధీంద్ర కులకర్ణిపై నల్లరంగుతో శివసేన కార్యకర్తలు దాడి చేసిన ఉదంతం కనుమరుగు కాకముందే శివసేన ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ వ్యాఖ్యలపై మండి పడుతోంది. దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ ఆమీర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పంజాబ్ లో శివసేన నాయకులు ఆందోళన, నిరసనలకు దిగారు.
పంజాబ్ లోని లుధియానాలో అమీర్ నటిస్తున్న 'దంగల్' సినిమా షూటింగ్ జరుగుతోంది. కండరాలు పట్టేయడంతో వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆమిర్ తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు లుధియానాకు వచ్చారు. ఆమిర్ అక్కడకు వచ్చిన విషయం తెలుసుకున్న శివసేన కార్యకర్తలు దంగల్ మూవీ యూనిట్ బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద ఆందోళన చేపట్టారు. అలాగే వారు ఓ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఆమిర్ ఖాన్ ను చెంప దెబ్బ కొట్టిన వారికి రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటించారు. ఆమిర్ ఖాన్ ను ఎన్ని సార్లు చెంప దెబ్బలు కొడితే అన్ని లక్షలను శివసేన తరపున అందజేస్తామని శివసేన పంజాబ్ విభాగం అధ్యక్షుడు రాజీవ్ టాండన్ ప్రకటించారు.
కావాలంటే తమ బంపర్ ఆఫర్ ను 'దంగల్' సినిమా టీమ్ సభ్యులు - ఎంబీడీ రాడిసన్ బ్లూ హోటల్ సిబ్బంది కూడా వినియోగించుకోవచ్చన్నారు. ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టినవారిని సాహసవంతులు, దేశభక్తి కలిగిన వారిగా గౌరవిస్తామని చెప్పారు. శివసేన ఆందోళనలో నేపథ్యంలో ముంబైలోని ఆమిర్ ఖాన్ ఇంటితో పాటు ప్రస్తుతం పంజాబ్ లో ఆమిర్ బసచేస్తున్న హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, వారం రోజుల విశ్రాంతి తర్వాత 'దంగల్' సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమిర్ ఖాన్ గురువారం ఉదయం లుధియానా చేరుకున్నారు. తన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు పెద్ద ఎత్తున రావడంతో ఆమిర్ కాస్త వెనక్కి తగ్గి తన వ్యాఖ్యలను వక్రీకరించారని...తాను ఇండియా విడిచి ఎప్పటకీ వెళ్లనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.