Begin typing your search above and press return to search.

ఊహించని ఆఫర్ తో మోడీకి షాకిచ్చిన మిత్రుడు

By:  Tupaki Desk   |   14 Oct 2016 5:10 PM GMT
ఊహించని ఆఫర్ తో మోడీకి షాకిచ్చిన మిత్రుడు
X
అందరికి షాకులిచ్చే మోడీకి.. ఊహించని రీతిలో షాకులిచ్చే అలవాటు శివసేనకే చెల్లు. బీజేపీలో మోడీ హవా మొదలుకాక ముందు ఆ పార్టీకి ఫుల్ సపోర్ట్ గా నిలిచిన శివసేన.. ఆ తర్వాత మాత్రం మోడీ మీద ఉన్న గుర్రును మొహమాటం లేకుండానే ప్రదర్శిస్తున్న వైనం తెలిసిందే. తాజాగా తనదైన వ్యాఖ్యతో మోడీ అండ్ కోకు షాకిచ్చే ప్రయత్నం చేసింది శివసేన. రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ప్రణబ్ దాను రెండోసారి రాష్ట్రపతిగా నియమించేందుకు తాము ఫుల్ సపోర్ట్ ఇస్తామంటూ ప్రకటించింది.

రాష్ట్రపతి రేసులోకి ప్రణబ్ నిలిచిప్పుడు ఆయనకు మద్దతు పలికిన శివసేన.. తాజాగా మరోసారి ఆయన రాష్ట్రపతి పదవిని చేపట్టాలని ఆశిస్తోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా మాట్లాడుతూ.. ప్రణబ్ ను రెండోసారి రాష్ట్రపతి పదవిని చేప్టటాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.ఈ విషయాన్ని ప్రణబ్ తో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. వచ్చే వారంలో రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసి తాము అనుకుంటున్నది ఆయన దృష్టికి తీసుకెళతామని చెప్పుకొచ్చారు.

ప్రణబ్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ తో సహా బీజేపీయేతర పార్టీలతో పాటు.. మరికొన్ని పార్టీలు సైతం మద్దతు పలికే అవకాశం ఉన్న నేపథ్యంలో శివసేన చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తావిచ్చినట్లైంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జులై నాటికి ప్రణబ్ దా పదవీ కాలం ముగియనుంది. దాదాపు పది నెలల ముందే ప్రణబ్ ను రెండోసారి రాష్ట్రపతి పదవి రేసులో నిలిపేందుకు వీలుగా శివసేన రంగంలోకి దిగటం మోడీ అండ్ కోకు కాస్త ఇబ్బందికరమనే చెప్పాలి.

ప్రణబ్ అభ్యర్థిత్వానికి.. కాంగ్రెస్ తో సహా ఆమ్ ఆద్మీ.. ఎంఐఎం.. డీఎంకే.. నేషనల్ కాన్ఫరెన్స్.. రాష్ట్రీయ జనతాదళ్.. జనతాదళ్ యునైటెడ్.. సమాజ్ వాదీ.. తృణమూల్.. కమ్యూనిస్టల సహా పలు పార్టీలు మద్ధుతు పలికే వీలుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం ప్రణబ్ తో ఉన్న స్నేహంతో ఆయనకు మద్దతు ఇచ్చే వీలుంది. పవర్ లో ఉండి కూడా తమెకు చెందిన వ్యక్తిని రాష్ట్రపతిగా చేసుకోకపోవటం అంటే.. రాజకీయంగా మోడీకి పెద్ద దెబ్బే అవుతుంది. అలా అని.. ప్రణబ్ కానీ రంగంలోకి దిగితే పోటీ ఓ రేంజ్లోఉంటుదనే చెప్పాలి. మరీ నేపథ్యంలో శివసేన ఆఫర్ కు ప్రణబ్ ఎలా రియాక్ట్ అవుతారన్నదే పెద్ద ప్రశ్న.