Begin typing your search above and press return to search.
మోడీ మిత్రుడి నుంచి పప్పుకి..భారీ పొగడ్త..!
By: Tupaki Desk | 23 July 2018 5:10 AM GMTచిరకాల మిత్రుడు దూరం కావటం ఎవరికైనా నష్టమే. రాజకీయాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. బీజేపీతో శివసేన స్నేహం ముగిసినట్లుగా చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా బీజేపీ ఉద్దేశించి ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి. బీజేపీని అస్పృశ్య పార్టీగా అభివర్ణిస్తూ.. ఆ పార్టీ చేతిని అందుకోవటానికి సైతం ఇష్టపడని వేళ.. బాహాటంగా ఆ పార్టీకి అండగా నిలిచి.. తమ వాదనను బలంగా వినిపించిన శివసేన.. తాజాగా చిరకాల మిత్రుడితో కటీఫ్ అనేందుకు దాదాపుగా సిద్ధమైపోయారు.
తమ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే అవకాశం ఎవరికీ ఇవ్వమన్న ఉద్ధవ్.. ఇంతకాలం బీజేపీని బాహాటంగా సమర్థించాం.. ఇకపై బాహాటంగా విమర్శిస్తామంటూ వ్యాఖ్యానించారు. "గతంలో మిత్రపక్షమైన బీజేపీని బహిరంగంగా సమర్థించాం. ఇకపై అలానే వ్యతిరేకిస్తాం" అంటూ ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బీజేపీపై ఫైర్ అయిన ఉద్ధవ్.. అందుకు భిన్నంగా రాహుల్ ను ఉద్దేశించి పాజిటివ్ గా రియాక్ట్ కావటం గమనార్హం.
లోక్ సభలో మోడీని కౌగిలించుకున్న వైనంపై బీజేపీ వర్గాలు తీవ్రస్థాయిలో దునుమాడుతున్న వేళ.. శివసేన మాత్రం అందుకు భిన్నంగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది. కౌగిలింత ఫోటోను.. సోదరా మా మనసుల్ని దోచుకున్నావ్ అంటూ వ్యాఖ్యతో ప్రముఖంగా ప్రచురించటం విశేషం. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కటీఫ్ అన్న విషయాన్ని ఇప్పటికే వెల్లడించిన శివసేన.. ఆ దిశగా ఆ పార్టీ అడుగులు పడుతున్నాయని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే రాజకీయ పరిణామం మరొకటి చోటు చేసుకుంది. ఒడిశా అధికారపక్షమైన బీజేడీ అధినేత బిజూ పట్నాయక్ ప్రధాని మోడీని పొగిడేశారు. శానిటరీ నేప్ కిన్లపైజీఎస్టీ ఎత్తి వేయటంపై హర్షం ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం వేళ.. బీజేడీ సభ్యులు వాకౌట్ చేసి.. బీజేపీకి లబ్ధిని చేకూర్చటం చూస్తే.. 2019 ఎన్నికల్లో కొత్త మిత్రులతో బీజేపీ ఎన్నికలకు వెళ్లటం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.