Begin typing your search above and press return to search.
మోడీపై.. శివసేన పంచ్ లు మామూలుగా లేవు!
By: Tupaki Desk | 18 Feb 2020 7:00 AM GMTఅవకాశం దొరికినప్పుడల్లా మోడీ సర్కారును ఎద్దేవా చేయడానికి శివసేన వెనుకాడటం లేదు. ఈ క్రమంలో మరోసారి బీజేపీ విధానాలను శివసేన ఆస్థాన పత్రిక సామ్నా గట్టిగా తప్పు పట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుజరాత్ పర్యటన సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లపై సామ్నా ఘాటుగా స్పందించింది. ప్రత్యేకించి ట్రంప్ పర్యటన లో భాగంగా ఆయన వెళ్లే దారిలో మురికి వాడలు కనిపించకుండా కడుతున్న గోడ విషయంలో సామ్నా తీవ్రంగా స్పందించింది.
ఈ గోడ కట్టడం అనేది బానిస మనస్తత్వానికి నిదర్శనం అని సామ్నా అభివర్ణించింది. ట్రంప్ ను బీజేపీ వాళ్లు బాద్ షాల ట్రీట్ చేస్తున్నారని, మహారాజ్య పరట్యనకు బానిసల్లా బీజేపీ వాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలా గోడ కట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటని కూడా ప్రశ్నించింది సామ్నా.
ఈ గోడ వల్ల అంతర్జాతీయంగా రూపాయి విలువ పెరగదని, మురికివాడల్లో ఉండే వారి జీవితాలు మెరుగుపడవని వ్యాఖ్యానించింది. స్వతంత్రం రావడానికి పూర్వం భారతదేశంలో ఎవరైనా బ్రిటీష్ రాజులు పర్యటించినప్పుడు ఇలాంటి ఏర్పాట్లే జరిగేవని, ఇప్పుడు అచ్చం అలాంటి ఏర్పాట్లే జరుగుతున్నాయని సేన పత్రిక పేర్కొంది.
ప్రజల సొమ్ముతో ట్రంప్ పర్యటనకు మెరుగులు దిద్దడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది సామ్నా. ఇలా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను, దానికి కేంద్రం ఇస్తున్న సహకారాన్ని తీవ్రంగా తప్పు పట్టింది శివసేన సొంత పత్రిక. బీజేపీ వాళ్లను ఇలాంటి విషయంలో, ఇలాంటి అవకాశాలను తాము వదిలి పెట్టేది ఉండదని సేన వాళ్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు.