Begin typing your search above and press return to search.
మోడీని ఆ మిత్రుడు మాత్రమే అన్ని మాటలు అనగలడేమో?
By: Tupaki Desk | 4 Jun 2019 5:02 AM GMTమిత్రుడిగా ఉంటూనే మొహమాటం లేకుండా కడిగిపారేసే తీరు శివసేనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో? మిత్రుడిగా వ్యవహరిస్తూనే మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం.. ఎన్నికల వేళలో భుజం భుజం కలిపి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవటం శివసేనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో? ఎన్నికల ముందు మోడీ మాష్టారిని తూర్పార పట్టేందుకు మొహమాటం ప్రదర్శించని ఆ పార్టీ.. కీలకమైన ఎన్నికల వేళ.. మోడీ అండ్ కోను ఒక్క మాట అనేందుకు ఇష్టపడని మిత్రుడిగా శివసేన వ్యవహరించింది.
ఎన్నికల వేళ మోడీ పరివారంపై పల్లెత్తు మాట అనటానికి ఇష్టపడని సేన.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మూడు.. నాలుగు రోజులకే మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేయటం విశేషం. శివసేన సొంత పత్రిక అయిన సామ్నాలో మోడీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్యలపై బీజేపీని నిలదీసిన సేన .. నిరుద్యోగ యువతలో ధైర్యాన్ని నింపేందుకు నాలుగు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
నాలుగు మాటలతోనో.. ప్రకటనలతోనో ఉద్యోగాల కల్పన జరగదని విరుచుకుపడిన సేన.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా ఉద్యోగ అవకాశాలు పెద్దగా ఉండవన్నారు. ప్రధానమంత్రి కౌశల్య వికాశ్ యోజన పథకంపై ప్రశ్నలు వర్షం కురిపించారు. రెండోసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. మోడీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చేయటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.
మోడీ ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం అయ్యాక షేర్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగిసిందని.. అదే సమయంలో జీడీపీ వృద్ధి చాటు ముఖం వేసిందన్నారు. నిరుద్యోగం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని.. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతోందని.. ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. విమానాశ్రయాలు ఉన్నా విమానాలు లేవన్న సామ్నా.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైనట్లు? అని ప్రశించారు.
ఎన్నికల వేళలో చైనాలోని 300 అమెరికా కంపెనీలు భారత్ లోకి వస్తున్నాయంటూ ప్రచారం చేశారు. తాజాగా పవర్లోకి వచ్చిన తర్వాత భారత వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించినట్లుగా పేర్కొన్నారు. మిత్రుడిగా ఉంటూనే మొహమాటం లేకుండా మోడీపై వ్యాఖ్యలు చేయటంలో శివసేన తర్వాతే ఏ మిత్రుడైనా అని చెప్పక తప్పదు.