Begin typing your search above and press return to search.
అత్యంత సంపన్న పార్టీ సేన
By: Tupaki Desk | 9 Aug 2018 5:48 PM GMTదేశంలోని రాజకీయ పార్టీల పోకడలను గుర్తించడం, ఆయా పార్టీలకు సంబంధించిన ప్రత్యేక అంశాలను తెలియజెప్పే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తాజాగా మరో ఆసక్తికరమైన నివేదిక విడుదల చేసింది. గతంలో నేరారోపణలు ఉన్న ప్రజాప్రతినిధులు - వ్యక్తిగతంగా ఆస్తిపరులుగా ఉన్న నాయకులు వంటి వివరాలను వెల్లడించిన ఏడీఆర్ తాజాగా దేశంలో అత్యంత సంపన్న పార్టీ లెక్కలు వివరించింది. ఏడీఆర్ గణంకాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ప్రాంతీయ పార్టీ అయిన శివసేన టాప్ లో నిలిచింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 25.65 కోట్లు స్వీకరించింది. ఇలా శివసేన మొదటి స్థానంలో నిలువగా మరో ప్రాంతీయ పార్టీ అయిన ఆప్ రూ24.73 కోట్ల విరాళాలతో తదుపరి స్ధానంలో నిలించింది.
రూ 20,000 మించిన విరాళాల వివరాలను రాజకీయ పార్టీలు వెల్లడించాలని - ఫామ్ 24ఏని పూర్తిగా నింపాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు రాజకీయ పార్టీలు సమర్పించిన రికార్డులను విశ్లేషించిన మీదట ఈ నివేదికను ఏడీఆర్ రూపొందించింది. ఈ లెక్కల ప్రకారం సేన మొదటి స్థానంలో - ఆప్ రెండో్ స్థానంలో ఉండగా...మరో ప్రాంతీయ పార్టీ అయిన పంజాబ్ కు చెందిన శిరోమణి అకాలీ దళ్ రూ 15.45 కోట్ల విరాళాలు రాబట్టి మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు పార్టీలే మరో ప్రత్యేకతను సైతం సొంతం చేసుకున్నాయి. ప్రాంతీయ పార్టీల కేటగిరీలో శివసేన-ఆప్-శిరోమణి అకాలీదళ్ కలిసి రూ.65.83 కోట్లు సమీకరించాయి.
ఇదిలాఉండగా...దేశ రాజధాని ఢిల్లీ నుంచి అత్యధిక విరాళాలు రూ 20.86 కోట్లు సమకూరినట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఆర్థిక రాజధాని అయిన ముంబై కలిగి ఉన్న మహారాష్ట్ర నుంచి 19.7 కోట్లు - పంజాబ్ నుంచి రూ 9.42 కోట్లు సమకూరాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. నగదు విరాళాల్లో రూ 72.7 లక్షలతో అసోం ప్రధమ స్ధానంలో నిలవగా,రూ 65 లక్షలతో పుదుచ్చేరి తదుపరి స్ధానంలో ఉంది.