Begin typing your search above and press return to search.
మోడీకి ఫైర్ బ్రాండ్ షాక్ అంతా ఇంతా కాదే
By: Tupaki Desk | 16 Nov 2016 3:55 AM GMTఅవకాశం అన్నిసార్లు రాదు. అలాంటిది వచ్చినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ప్రత్యర్థి మళ్లీ పైకి లేవకుండా దెబ్బేస్తే సరిపోతుంది. రాజకీయాల్లో డక్కాముక్కీలు తిన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి.. ఫైర్ బ్రాండ్ గా అభివర్ణించే మమతా బెనర్జీకి అలాంటి దెబ్బలు ఎలా కొట్టాలన్నది బాగా తెలుసు. మోడీ నీడను సైతం వ్యతిరేకించే దీదీ.. తాజాగా ఆయన తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆమె విప్పిన గళానికి.. మరికొన్ని రాజకీయ పక్షాలు జత కావటం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.
మోడీ వ్యతిరేకుల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు నోట్ల రద్దు వ్యవహారం అనుకోని వరంగా మారింది. ఎన్నికల వేళ మాత్రమే జత కలిసే పక్షాలన్నీ.. నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయంతో ఒక్కటయ్యారు. ఆయన నిర్ణయంపై తీవ్ర స్థాయిలో నిరసనలు.. ఆందోళనలు నిర్వహించాలని.. తద్వారా తమ వాదనకు తగిన బలాన్ని ప్రదర్శించటం.. ప్రజల నుంచి స్పందనను కోరుకుంటున్నారు.
నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకున్నా.. గడిచిన మూడు రోజులుగా వారు పడుతున్న తిప్పలతో ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలవుతోంది. తమ వద్దనున్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద ఉన్న భారీ క్యూలు.. ఏటీఎం కష్టాలు పెరుగుతున్న కొద్దీ.. మోడీని మొదట్లో సమర్థించిన వారు సైతం వ్యతిరేకిస్తున్న పరిస్థితి.
ఇదే విషయాన్ని గుర్తిస్తున్న మోడీ వ్యతిరేక కూటమి ప్రజల్లో మరింత అసంతృప్తి రాజేసేందుకు వీలుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్నటికి మొన్న మోడీకి వ్యతిరేకంగా గళం విప్పేందుకు పలు రాజకీయ పక్షాలు సమావేశం కాగా.. ఈ రోజు నోట్ల రద్దుపై మమతా బెనర్జీ నేతృత్వంలో ఒక నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నారు. దీనికి బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న శివసేన పాలుపంచుకోవటం మోడీకి భారీ షాక్ గా అభివర్ణిస్తున్నారు. మోడీ హవా బీజేపీలో మొదలయ్యాక.. ఆ పార్టీకి విశ్వసనీయ.. విశ్వాసపాత్రంగా ఉండే మిత్రపక్షంగా పేరున్న శివసేన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అవకాశం దొరికిన ప్రతిసారీ మోడీపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించే శివసేన చీఫ్.. తాజాగా నోట్ల రద్దుపై దీదీ నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొంటామని స్పష్టం చేస్తున్నారు. ఇది మోడీకి ఇబ్బందికర పరిణామంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/