Begin typing your search above and press return to search.
కరోనా ‘వ్యాక్సిన్’ బీహారోళ్లకేనా.. ఇదీ రాజకీయమేనా..? బీజేపీపై శివసేన - టీఆర్ ఎస్ మండిపాటు!
By: Tupaki Desk | 23 Oct 2020 3:30 PM GMTబీహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ అక్కడి ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోలో పెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రమశిక్షణ గల పార్టీగా బీజేపీ చివరకు ‘కరోనా వ్యాక్సిన్’ ను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నదని ఆరోపణలు వస్తున్నాయి. ‘అంటే ఒక్క బీహార్ ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తే మిగిలిన రాష్ట్రాల ప్రజలు ఏమైపోవాలి. బీజేపీ మరీ ప్రాంతీయపార్టీల స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నది’ అంటూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
‘భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తుంది కదా! అది తెలంగాణ ప్రజలకు ఎప్పుడిస్తారు? అంటూ ఓ ఔత్సాహికుడు ట్విట్టర్లో కేటీఆర్‌ను ప్రశ్నించాడు. దీనికి కేటీఆర్ బదులిస్తూ ‘బ్రదర్ కరోనా వ్యాక్సిన్‌పై మనం ఇప్పుడు ఆశలు పెట్టుకోవద్దు.. దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల వ్యాక్సిన్ డోసులు బీహార్ ప్రజల కోసం దాచిపెట్టి ఉంచారు. వాళ్లకు వేశాక మిగిలిన రాష్ట్రాల ప్రజలకు ఇస్తారు’ అంటూ బదులిచ్చారు. కాగా ఈ రీట్వీట్ ట్విట్టర్లో మారుమోగుతోంది.
సదరు నెటిజన్ ఈ ట్వీట్‌ను డిలిట్ చేసినప్పటికీ కేటీఆర్ రీట్వీట్ మాత్రం ట్రెండ్ అవుతూనే ఉండటం విశేషం. అయితే అంతకు ముందు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ దారుణ రాజకీయాలు చేస్తోంది. గతంలో బీజేపీ సిద్ధాంతం ఏమిటంటే ‘ మాకు రక్తం ఇవ్వండి.. మేము మీకు స్వేచ్ఛ నిస్తాం’ అని కానీ ఇప్పుడు అది మారిపోయింది. ‘మాకు ఓటు వేయండి మేము వ్యాక్సిన్ ఇస్తాం’ ఇలా భారతీయ జనతాపార్టీ రోజురోజుకూ రాజకీయంగా దిగజారుతోంది.. అంటూ ఆయన ఆరోపించారు.