Begin typing your search above and press return to search.
వెంకయ్యపై బీజేపీ మిత్రపక్షం ఫైరయింది
By: Tupaki Desk | 27 April 2016 9:51 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితంగా ఉండే కేంద్రమంత్రులు - పార్టీ సీనియర్లూ ఆయనను దైవంతో సమానంగా పొగడటంపై బీజేపీ మిత్రపక్షమైన శివసేన మండిపడింది. మోడీని ఇతర పార్టీల కన్నా తీవ్రంగా విమర్శిస్తూ సామ్నా పత్రిక రోజూ సంపాదకీయాలు రాస్తోంది. ఈ క్రమంలో తాజాగా రాసిన సంపాదకీయంలో 'భారతదేశానికి దేవుడిచ్చిన బహుమతి మోడీ' అంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల వ్యాఖ్యానించడాన్ని శివసేన ప్రస్తావించింది. వెంకయ్య సహచర మంత్రి రాధా మోహన్ సింగ్ కూడా మోడీని పొగుడుతూ ఇటువంటి పదజాలాన్నే ప్రయోగించారని పేర్కొంది.
సామ్నా తాజా సంచికలో మోడీ భజనపరులను ఏకేస్తూ ఘాటైన పదజాలంతో సంపాదకీయం రాసింది. భజనపరుల వల్లే మోడీకి ముప్పు అని హెచ్చరించింది. ఇందిరాగాంధీ - రాజీవ్ ల మాదిరిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పొగిడించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అదే పనిగా ఆరోపణలు గుప్పించిన కమలనాథులు ఇప్పుడు చేస్తున్నది కూడా అదేనని వ్యాఖ్యానించింది. అనువంశిక రాజకీయాలు - వ్యక్తి ఆరాధనా కాంగ్రెస్ సంస్కృతి అంటూ దుమ్మెత్తిపోసిన బీజేపీ నేతల బృందం ఇపుడు అదే పనిచేస్తోందని సామ్నా ఘాటుగా విమర్శించింది. మోడీ వారసత్వ రాజకీయాలను అనుసరించకపోయినా, పొగిడేవారిని చేరదీస్తున్నారని వారికి పదవులు ఇస్తున్నారని ఎద్దేవా చేసింది.
బీహార్ ఎన్నికల సందర్భంగా మోడీని వ్యతిరేకించే వారికి భారత్ లో స్థానం లేదనీ, వారంతా పాక్ వెళ్ళిపోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రి పదవిని బహుమతిగా అందుకున్నారని గుర్తుచేసింది. పదవుల కోసమే మోడీని ఆయన చుట్టూ ఉన్నవారు దేవుణ్ణి చేసేస్తున్నారనేది ఎప్పుడు తెలుసుకుంటారో అంటూ ఎద్దేవా చేసింది.