Begin typing your search above and press return to search.
కర్ణాటకలో కమల పరాభవం వెనుక అతడు!
By: Tupaki Desk | 7 Nov 2018 5:31 AM GMTమోడీషాలను నిర్మోహమాటంగా తిప్పి కొట్టారు కన్నడ ప్రజలు. అధికారాన్ని చేపట్టటానికి అడుగు దూరంలో ఆగిపోయిన ఏ రాజకీయ పార్టీ పైన అయినా సానుభూతి వెల్లువలా ఉండాలి. అందుకు భిన్నంగా ప్రజలు తిరస్కరిస్తుంటే అంతకు మించిన షాకింగ్ అంశం మరొకటి ఉండదు. తాజాగా కర్ణాటకలో వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. ఇదే విషయం ఇట్టే అర్థమవుతుంది. కర్ణాటకలో ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్ని సొంతం చేసుకున్న పార్టీగా బీజేపీ అవతరించింది. కర్ణాటక కోటను తాము సొంతం చేసుకున్నట్లుగా కమలనాథులు సంబరాలు చేసుకున్నారు కూడా.
ఊహించనిరీతిలో ఫలితాలు మొత్తం వెలువడే సమయానికి పరిస్థితి మొత్తం మారిపోవటమే కాదు.. పవర్ చేతికి వచ్చేసిందన్న ధీమాతో ఉన్న కమలనాథులు కంగుతినేలా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కాషాయపార్టీకి దిమ్మ తిరిగే షాకిచ్చింది. అప్పటి నుంచి దెబ్బ తిన్న బెబ్బులిలా మారిన బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. ఏ మాత్రం అవకాశం వచ్చినా అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో జరిగిన తాజా ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి ఘోర పరాభవం తప్పలేదు.
కమలనాథులకు కంచుకోటగా.. రాజకీయ ప్రత్యర్థులకు వణుకు పుట్టించే బళ్లారిలో గాలి స్పీడుకు బ్రేకులు వేసేలా తాజా ఫలితం ఉండటం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఈ స్థాయిలో షాక్ తగలటానికి కారణం ఏమిటి? ఎవరి వ్యూహ రచనతో ఇలాంటి ఫలితాలు వచ్చాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే .. కాంగ్రెస్ సీనియర్ నేత.. రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ పేరును పలువురు చెబుతారు. బీజేపీకి వరుస షాకులు ఇవ్వటంలో ఆయన ట్రాక్ రికార్డు మా గొప్పగా ఉందని చెప్పాలి.
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటాపోటీగా బలం ఉన్న వేళ.. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో ఆయన కీ రోల్ పోషించారు.
తమ అధికారానికి అడ్డు వచ్చిన శివకుమార్ కు చుక్కలు చూపించేందుకు ఈడీ..ఐటీ ఆస్త్రాన్ని ప్రయోగించినప్పటికి ఆయన భయపడలేదు. అంతేనా.. తాజా ఉప ఎన్నికల్లో తన సత్తా చాటి మోడీషాలకు మరోసారి చుక్కలు చూపించారు. షా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహరచనలో చిత్తు చేసిన శివకుమార్ దెబ్బకు కర్ణాటక బీజేపీ అగ్రనేతలు యడ్యూరప్ప.. గాలి బ్రదర్స్ తో పాటు శ్రీరాముల ఎత్తులేమీ పారలేదు.
తనను ఇబ్బంది పెట్టేందుకు ఐటీ..ఈడీలను ఉసిగొల్పిన బీజేపీ అగ్రనాయకత్వానికి తాజా ఫలితాలతో శివకుమార్ ప్రతీకారం తీర్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఆయన వ్యూహరచనతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేకుండా చేసిన ఆయన రానున్న రోజుల్లో సీఎం పదవిని చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. సో.. మోడీషాల ఎత్తులను చిత్తు చేసే సత్తా ఉన్న నేత ఒకరు కర్ణాటకలో ఉన్న విషయం తాజా ఫలితాలు మరోసారి స్పష్టం చేసినట్లే.