Begin typing your search above and press return to search.

అరే.. చంద్ర‌బాబునే తోసేశారు.. నేనెంత‌?

By:  Tupaki Desk   |   24 May 2019 5:21 AM GMT
అరే.. చంద్ర‌బాబునే తోసేశారు.. నేనెంత‌?
X
త‌మ్ముళ్ల ఆవేద‌న అంతా ఇంతా కాద‌న్న‌ట్లుగా ఉంది. ఓడిపోతే ఓడిపోయాం కానీ.. మ‌రీ ఇంత దారుణ‌మా? అన్న‌ది వారి ఆవేద‌న‌. ఎన్నిక‌లు అన్నాక గెల‌వ‌టం.. ఓడిపోవ‌టం ఎవ‌రో ఒక‌రికి ఎదురుకావాల్సిందే. కానీ.. మ‌రీ ఇంత దారుణ‌మైన ఓట‌మా? 175 స్థానాల‌కు 150 స్థానాల్లో ఓట‌మా (టీడీపీ నేత‌లు మాట్లాడే స‌మ‌యానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధిక్యంలో ఉన్న సీట్లు) అంటూ బేల‌గా ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌జ‌ల తీర్పును శిర‌సావ‌హిస్తామంటూనే.. ప్ర‌జ‌లు కాస్త తొంద‌ర‌ప‌డ్డారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చిత్తూరు ఎంపీగా రెండుసార్లు విజ‌యం సాధించిన శివ‌ప్ర‌సాద్ తాజాగా ఓట‌మిపాలు కావ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న ఆవేద‌నను వ్య‌క్తం చేశారు.

ఇవాళ పొద్దున్నేఎంతో ఆనందంగా.. ఎన్నో ఆశ‌ల‌తో ఇంటి నుంచి బ‌య‌లుదేరాన‌ని.. కానీ.. అంత‌లోనే మొత్తం మారిపోయింద‌న్నారు. ఓట‌మి ఎవ‌రికైనా ఎదురుకావొచ్చు కానీ.. మ‌రీ ఇంత దారుణ‌మా? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌మైక్య‌వాదానికి.. ప్ర‌త్యేక హోదా కోసం తానెంతో పోరాడ‌టం చేశాన‌ని.. కానీ ప్ర‌జ‌లు ఇలాంటి తీర్పు ఇస్తార‌ని ఊహించ‌లేద‌న్నారు. హ్యాట్రిక్ సాధిద్దామ‌ని అనుకుంటే.. ఓట‌మి ఎదురైంద‌న్నారు.

175 సీట్ల‌కు 150 సీట్ల‌లో గెలుపు వెనుక ఏదో ట్రిక్ ఉంద‌ని.. అది త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్నారు. రానున్న ఆర్నెల్లు.. ఏడాది పాటు ఎన్నిక‌ల ఫ‌లితాల మీద‌నే చ‌ర్చ జ‌రుగుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఫ‌లితాలు ఇంత‌లా రావ‌టం వెనుక క‌చ్ఛితంగా ట్రిక్ ఉంటుంద‌న్న ఆయ‌న‌.. ఆ విష‌యంలో బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని.. మీరే చూస్తారుగా అంటూ వ్యాఖ్యానించారు. త‌న ఓట‌మి గురించి చెబుతూ.. అరే.. చంద్ర‌బాబునే తోసేశారు.. నేనెంత‌? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శివ‌ప్ర‌సాద్ మాట‌ల్ని చూస్తే.. తాజాగా వెలువ‌డిన ఫ‌లితాలు ఆయ‌నొక్క‌రికే కాదు.. తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు భారీ షాక్ ను ఇచ్చాయ‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.