Begin typing your search above and press return to search.

సముద్రుడు, శివుడు చేసే అద్భుతమా ఇది!

By:  Tupaki Desk   |   21 July 2016 10:31 AM GMT
సముద్రుడు, శివుడు చేసే అద్భుతమా ఇది!
X
మనదేశంలో ఎన్నో దేవాలయాలు ఉంటాయి.. వాటిలో ఒక్కో దేవాలయానిదీ ఒక్కో ప్రత్యేకత! అయితే ఆ ప్రత్యేకత భక్తికి సంబందించో - చరిత్రకు సంబందించో ఉంటుంది. కానీ... గుజరాత్ లో ఉన్న ఒక దేవాలయం ప్రత్యేకత మాత్రం.. వీటన్నింటికంటే ప్రత్యేకమైంది. అదేమిటంటే.. ఈ దేవాలయం రోజులో కాసేపు కనిపిస్తుంది, కాసేపు కనిపించదు. ఇది మాయా కాదు - మరేమీ కాదు.. సముద్రుడు చేసే ఒక అద్భుతం!

అసలు విషయానికొస్తే... గుజరాత్ - భావనగర్ కు సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న అరేబియా సముద్రం ఒడ్డున ఒక పరమేశ్వరుని దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి మనం ఉదయాన్నే వెళ్లిచూస్తే కనిపించదు. కాకపోతే అక్కడ ఒక దేవాలయం ఉంది అనేందుకు గుర్తుగా ఒక ద్వజస్తంభం మాత్రం కనిపిస్తుంది. మధ్యాహ్నం వెళ్లామనుకోండి.. అక్కడ శివాలయం కనిపిస్తుంది. మరలా రాత్రి పదిగంటల తర్వాత వెళ్లి చూస్తే అక్కడ ఆ గుడి ఉండదు. అదెలా సాధ్యం అంటారా? ఇదంతా సముద్రుడు - శివుడు కలిసి చేసే చిత్రాలని చెబుతుంటారు భక్తులు.

ఈ శివాలయం సముద్రం ఒడ్డున ఉండటంతో రాత్రి పదిగంటల తర్వాత సముద్రం ముందుకు రావడం వల్ల ఆ నీటిలో ఆలయం మునిగిపోతుంది - అనంతరం తర్వాతి రోజు మధ్యాహ్నం సమయంలో సముద్రం కాస్త వెనక్కి వెళ్తుంది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట నుండి దేవాలయం మరల కనిపిస్తుంది. ఈ ఈ సమయాల్లో దేవాలయానికి వెళ్ళిన భక్తులు ఎవరైనాసరే - రాత్రి పదిగంటల లోపు బయటకు వచ్చేయాల్సిందే! ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిసమయాల్లో సముద్రం మరీ ముందుకు రావడం వల్ల పూర్తిగా ఆ ఆలయం సముద్రగర్భంలోకి చేరిపోతుంది.ఈ దృశ్యం అక్కడి యాత్రికులకు ఆశ్చర్యానికి - ఆనందానికి గురిచేస్తుంది. ఈ దేవాలయాన్ని పాండవులు నిర్మించారనేది అక్కడి స్థలపురాణంగా చెబుతుంటారు స్థానికులు.