Begin typing your search above and press return to search.
మళ్లీ శివాజీ ఎంట్రీ.. వైసీపీ నేతల గుసగుస ఇదే..!
By: Tupaki Desk | 19 Nov 2021 3:30 PM GMTశివాజీ.. గుర్తున్నాడా? `ఆపరేషన్.. గరుడ`.. అంటూ.. అప్పట్లో.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పైనా.. ఏపీలోని జగన్ సర్కారుపైనా విమర్శలు గుప్పించారు. పెద్ద రాద్దాంతమే చేశారు. దీంతో శివాజీని .. గరుడ పురాణం చెప్పే వాడిగా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్రం ఏదో కుట్ర చేస్తోందని.. పెద్ద ఎత్తున శివాజీ ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆయన గ్రాఫులు.. గట్రా కూడా వేసి చూపించారు. ఇక, ఆ తర్వాత.. జగన్ సర్కారుపైనా విమర్శలు చేశారు. రాజధాని విషయంలో.. జగన్‌ను ఏకేశారు. రాజధానికి మద్దతుగా కూడా వ్యాఖ్యలు చేశారు.
ఇక, కృష్ణా పుష్కరాలకు వచ్చిన సమయంలోనూ నీటిలో ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఇక, ఏమైందో ఏమో.. చాన్నాళ్లుగా.. శివాజీ మీడియా ముందుకు రాలేదు. గతంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే.. తాజాగా మళ్లీ మీడియా ముందుకు వచ్చారు.
అంతేకాదు.. రాజధాని రైతులకు మద్దతు అంటూ.. వారు చేస్తున్న మహాపాదయాత్రలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ చేసిన కొన్ని కామెంట్లు.. ఆసక్తిని రేపాయి. ఏపీ అనేది రాష్ట్రం కాదని, కులాల కుంపటి అని హాట్ కామెంట్ చేశారు.
రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎవరూ గుర్తించడం లేదని, మనమంతా బాగా పొల్యూట్ అయ్యామ ని వ్యాఖ్యానించాడు. ఒక నిర్ణయం తీసుకుని ఒకరిని ఎన్నుకుని చట్ట సభలకు పంపితే విడగొట్టాలనుకునే వారు విడగొట్టారని పరోక్షంగా వైసీపీని టార్గెట్ చేయడం గమనార్హం. రాజధానిని అభివృద్ధి చేయాలనుకు న్న వారు చేశారని, మరొకరు ఇంకొక మాట అంటున్నారన్నారు. కులాల కుంపట్ల మధ్య ఏపీ ఏమి అభివృ ద్ధి చెందుతుందని ప్రశ్నించారు.
అయితే.. ఈ వ్యాఖ్యలతో శివాజీ మరోసారి రాజకీయ నేతలకు టార్గెట్.. అయ్యారు. అసలు కులాల కుంపట్లను రాష్ట్రంలో రగిలించింది ఎవరో కూడా .. శివాజీ చెబితే.. బాగుంటుందని అంటున్నారు. ఇక, మంత్రులను కూడా శివాజీ వదిలిపెట్టలేదు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని.. వంటి మంత్రులు ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చన్నారు. రాజకీయ నేతలు తాము శాశ్వతం అనుకుంటే కుద రదని చెప్పారు.
అయితే.. శివాజీ చేసిన వ్యాఖ్యలు.. గతంలోనూ మంత్రులపై ఎందుకు చేయలేదని.. నెటి జన్ల ప్రశ్న. ఇప్పుడు అనవసరంగా.. ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఏదో చేయాలని అనుకోవడం.. ఏమీ చేయకపోవడం.. వంటి విషయాల్లో.. శివాజీ గతంలో ఫెయిలైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. శివాజీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఆయన వల్ల కొద్దిసేపు మీడియాకు టైం పాస్ తప్ప ఏమీ ఒరిగేది లేదని.. వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.