Begin typing your search above and press return to search.
వాళ్లిద్దరి వల్లే ఏపీ సర్వనాశనం..
By: Tupaki Desk | 27 Aug 2015 3:53 AM GMTనటుడు శివాజీ మరోసారి గళం విప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్న ఆయన.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. విపక్ష నేత వైఎస్ జగన్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఇరువురు అగ్రనేతలపై నిప్పులు కురిపించినంత పని చేశారు. మొదట్లో ఆచితూచి మాట్లాడే ఆయన.. ఈ మధ్య కాలంలో స్వరాన్ని పెంచారు.
ఏపీకి జరిగిన.. జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపటమే కాకుండా.. విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయం ఎంతన్నది శివాజీ తన మాటల ద్వారా ఆంధ్రోళ్లకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. విభజన కారణంగా రాష్ట్రం మొత్తంగా నష్టపోయిందని.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేయటం లేదన్నారు. ‘‘ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేసేందుకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? నిజాల్ని ప్రజలకు చెప్పాలి. సీఆర్ డీయే ప్రాంతానికి హోదా కోసం ప్రయత్నించటం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ వెలుగులు విరజిమ్ముతుందని ఏపీ ప్రజల ఆశల్ని బాబు వమ్ము చేస్తున్నారని.. ఇక.. విపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఏపీ ప్రయోజనాలు అస్సలు పట్టటం లేదన్నారు.
ఎంతసేపు.. మీలో మీరు కొట్టుకుంటూ.. స్వార్థంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న శివాజీ.. ఈ ఇరువురు నేతలతో ఏపీ సర్వనాశనం అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఒక రైలు లేదని.. ఒక హాస్పిటల్.. రోడ్డు.. ఇలా ఏమీ లేవని.. అయినా వాటి కోసం ప్రయత్నించకుండా రాజకీయాలతో కాలం గడిపేస్తున్నారన్నారు.
చంద్రబాబు గురించి ఎవరైనా మాట్లాడితే.. బాబును విమర్శించే స్థాయా అని వ్యాఖ్యానిస్తున్నారని.. అలా ఎలా మాట్లాడతారని శివాజీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్న 400 సంస్థల మీద ఏనాడైనా.. ఒక్కరైనా మాట్లాడారా? అని ప్రశ్నించిన శివాజీ విభజనతో ఏపీలో కాంగ్రెస్ మంట పెడితే.. తాజాగా బీజేపీ అందులో పెట్రోల్ పోసిందంటూ విరుచుకుపడ్డారు. మొత్తానికి అధికార.. విపక్ష నేతల్ని ఇద్దరిని హోల్ సేల్ గా దుమ్ము దులిపేశారని చెప్పొచ్చు.