Begin typing your search above and press return to search.

సుజ‌నా ఓ శ‌ని, బ్యాంకు మోసగాడు

By:  Tupaki Desk   |   2 Sep 2016 5:16 AM GMT
సుజ‌నా ఓ శ‌ని, బ్యాంకు మోసగాడు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివ‌రించిన కేంద్రమంత్రి - టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి ఊహించ‌ని విమ‌ర్శ ఎదురైంది. ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు - నటుడు శివాజీ సుజ‌నా తీరుపై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌తో పాటు టీడీపీని సైతం దుమ్మెత్తిపోశారు. ఏపీకి ప్రత్యేక హోదా విష‌యంలో తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ నేతల ప్రవర్తన చూస్తుంటే రెండు రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత తాము పోరాటం చేశామ‌ని ప్ర‌క‌టించుకునేలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అస‌లు ప‌రిస్థితి చూస్తే కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడేలా కనబడడం లేదని శివాజి సందేహం వ్య‌క్తం చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు న్యాయం విష‌యంలో సుజ‌నా చెప్తున్న వివ‌ర‌ణ అనుమాన‌స్ప‌దంగా ఉంద‌ని శివాజి అభిప్రాయ‌ప‌డ్డారు.
కేంద్రం ఎక్కువ డబ్బులిస్తామంటున్నద‌ని చెప్తున్న సుజ‌నా చౌద‌రి ఆ నిధుల వల్ల ప్రజలకు నేరుగా జరిగే మేలు ఏమిటో చెప్పాల‌న్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వస్తాయనుకున్నా, ఈ నిధుల వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలని శివాజి నిలదీశారు. కేంద్రం ఇచ్చే రాయితీలు, నిధుల వల్ల సుజనాకే లాభం ఎక్కువ‌గా జరుగుతుందేమోన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా సుజ‌నా తీరుపై శివాజి విరుచుకుప‌డ్డారు. బ్యాంకుల స్కాముపై ఉన్నంత అవగాహన ఆంధ్రప్రదేశ్ సమస్యలు, లాభాలపై సుజనాకు ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. ఆయ‌న ఓ శ‌నిలాగా దాపురించాడ‌ని మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్యాకేజీకి అంగీకరిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ముందే ఆత్మహత్య చేసుకుంటానని శివాజి మ‌రోమారు హెచ్చరించారు. ఏపీ ప్ర‌జ‌ల‌ను అప‌హాస్యం చేసేలా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న సుజనాని కేంద్రమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే చంద్రబాబును కూడా ఎవరూ నమ్మే అవకాశం ఉండదన్నారు.