Begin typing your search above and press return to search.

గరుడపురాణం... మొహం చాటేస్తున్న శివాజీ!

By:  Tupaki Desk   |   28 Oct 2018 8:45 AM GMT
గరుడపురాణం... మొహం చాటేస్తున్న శివాజీ!
X
గరుడపురాణం అంటూ కొన్నాళ్ల కిందట కామెడీ చేస్తున్నాడు అని అంతా అనుకున్నారు. అయితే ఆ గరుడపురాణం ఇప్పుడు నిజం అవుతోంది. ఒకవేళ శివాజీ చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వమే ఈ ఆపరేషన్ గరుడను నడిపిస్తున్నట్టుగా అయితే, ఆ కుట్ర ఎలాగూ బయటపడిపోయింది కాబట్టి ఆ ప్లాన్ అమలు ఆగాల్సింది. కానీ అది ఆగడం లేదు. తాము కుట్ర చేయదలుచుకుంటే అది బయటపడ్డాకా ఎవరైనా అమలు చేస్తారా? చేయరు కదా.. దీన్ని బట్టి గరుడపురాణం కథేంటి? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇది చంద్రబాబు నాయుడి పథక రచనే అని, ఢిల్లీలోని బాబు మనుషులు దీన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. బాబు మాజీ ఓఎస్డీ అభీష్ట ఈ ప్రణాళికను అమలు పరుస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివాజీ పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది.

మరి ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై జరగబోయే కుట్రను, హత్యాయత్నాన్నిముందుగానే చెప్పాడు కదా.. ఇప్పుడు అదే జరిగింది కదా.. ఇప్పుడు శివాజీ మీడియా ముందుకు రావాల్సింది. ఈ ఆపరేషన్ గురించి తనకు ఎలా సమాచారం అందిందో.. దీని వెనుక ఎవరు ఉన్నారో చెప్పాల్సింది. ఇలా జరుగుతంది అని చెప్పిన వ్యక్తికి ఇప్పుడు జరిగాకా మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే శివాజీ ఇప్పుడు మీడియా ముందుకు రావడం లేదు. మొహం చాటేస్తున్నాడు.

ప్రత్యేకించి ఒక టీవీ చానల్ వారు ఈ విషయంలో ఈ నటుడిని చర్చకు పిలిచినట్టుగా సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆ చర్చాకార్యక్రమానికి వస్తాడని.. ఆయనతో గరుడ గురించి చర్చకు రమ్మని శివాజీని సదరు చానల్ పిలిచినా ఆయన మాత్రం ముందుకు రాలేదని తెలుస్తోంది. కీలకమైన సమయంలో ఈ అంశంపై చర్చకు ముందు రావడం లేదు ఈ కమేడియన్. అసలు ఈ గేమ్ లో శివాజీ ఒక పావు మాత్రమే అని..అసలు కథ బాబు, లోకేష్, అబిష్టల కనుసన్నల్లో నడుస్తోందని.. ఇప్పుడు శివాజీ లాక్కోలేని పీక్కోలేని స్థితిలో ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు. అందుకే అతడు మొహం చాటేస్తూ ఉండవచ్చని చెబుతున్నారు.