Begin typing your search above and press return to search.
'గరుడ' శివాజీ రాలేదు గానీ..కేసును కొట్టేయాలట
By: Tupaki Desk | 11 Jun 2019 5:57 PM GMTటీవీ 9 వివాదంలో నిండా మునిగిపోయి... అత్తా పత్తా లేకుండా పోయిన సినీ నటుడు శివాజీ తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. టీవీ 9 మాజీ సీఈఓతో కలిసి ఆ ఛానెల్ కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన వ్యవహారంలో రవి ప్రకాశ్ తో పాటు శివాజీ పైనా కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇప్పటికే పలు నోటీసులు జారీ చేశారు. అయితే శివాజీ మాత్రం వాటికేమీ స్పందించకుండా పరారీలో ఉన్నారు.
కేసులో కీలక నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్... ఇక దాక్కోవడం కుదరదని ఓ అంచనాకు వచ్చేసి పోలీసుల ముందుకు వచ్చారు. అయితే రవిప్రకాశ్ ను మించిపోయినట్లుగా వ్యవహరిస్తున్న శివాజీ మాత్రం దాగుడు మూతలే ఆడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఓ ఆసక్తికర అడుగు వేసిన శివాజీ... అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాను పో్లీసుల విచారణకు హాజరుకాకుండానే... అసలు తాను ఎక్కడున్నానన్న విషయాన్ని చెప్పకుండానే తనపైన నమోదైన కేసును కొట్టేయాలని ఆయన ఓ వింత డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
టీవీ 9 వివాదంలో తన పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన సదరు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇంకా స్పందించలేదు గానీ... గతంలో గరుడ పురాణం పేరిట ఓ కొత్త పురాణం విప్పిన శివాజీ... ఈ కేసులో తనదైన కొత్త శైలి వ్యవహారాన్ని చాటుకున్నారు. అయినా పోలీసులు తన కోసం వెతుకుతూ ఉంటే... తానెక్కడున్నానన్న విషయాన్ని చెప్పకుండానే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని డిమాండ్ చేశారంటే... శివాజీ ధైర్యం ఏమిటన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది.