Begin typing your search above and press return to search.
ప్రాణంపోయినా...'ప్రత్యేక హోదా' వదలను
By: Tupaki Desk | 27 Jun 2015 4:25 PM GMTఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినదిస్తున్న హీరో శివాజీ మరోమారు తన గళం వినిపించారు. ఈ సారి హైదరాబాద్ వేదికగా తన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి నిర్ణయం తీసుకోకుంటే...కేంద్ర మంత్రులు ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని విడిచిపెట్టి స్మార్ట్ సిటీల జపం చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంకయ్యకు ఆంధ్రప్రజల ప్రయోజనాల కంటే...అభివృద్ధి అంశాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉన్నట్లుందన్నారు. స్మార్ట్ సిటీలు అంటూ అసలు విషయం నుంచి స్మార్ట్ గా తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తన ప్రాణంపోయినా..ప్రత్యేక హోదా డిమాండ్‌ను చావనివ్వనని శివాజి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు నేతలు ప్రత్యేక హోదాపై
విమర్శలు, కామెంట్లు చేసుకుంటూ ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారని మండిపడ్డారు. మీలో మీరు కొట్టుకొని చావండికానీ...ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడండి అంటూ మండిపడ్డారు. అలా చేస్తే అయినా...ప్రజలకు పీడ విరగడ అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్న రాజకీయ నాయకుల కుటుంబాలకు అదే ప్రజల ఉసురు తగులుందని శపించారు!
కార్యకర్తల కోసం ఓదార్పు యాత్రలు చేస్తున్న వైఎస్ జగన్ ఏపీ ప్రజలందరి ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదాపై ఎందుకు మాట్లాడటం లేదని శివాజీ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడని నేతలను నిలదీస్తూ పర్యటనలు చేయనున్నట్లు శివాజి స్పష్టం చేశారు.