Begin typing your search above and press return to search.
రాజధాని పై శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది?
By: Tupaki Desk | 1 Jan 2020 10:14 AM GMTఅది 2014.. రాజధాని కూడా లేకుండా విడిపోయిన నవ్యాంధ్ర కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గద్దెనెక్కారు. ఏపీకి రాజధాని ఎంపిక కోసం నిష్టాతుడైన సీనియర్ అధికారి శివరామకృష్ణ నేతృత్వం లో కమిటీ వేశారు. రాష్ట్రమంతా పర్యటించిన శివరామకృష్ణ కమిటీ ఏపీ రాజధాని పై కీలక సిఫారసులు చేసింది.
కానీ మన చంద్రబాబు మాత్రం శివరామకృష్ణ కమిటీ సిఫారసులు బట్టదాఖలు చేసి రాజధాని పై లీక్ చేసి భూపందేరాలుగా మార్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. దీనిలో భూమలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని జగన్ ప్రభుత్వం తేల్చింది. ఇప్పుడు విశాఖను పరిపాలన రాజధాని గా చేయడానికి రెడీ అవుతోంది.
* ఈ క్రమంలోనే అసలు శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందనే విషయాలను తెలుసుకుందాం..
*శివరామకృష్ణ కమిటీ సూచించిన ప్రధాన సిఫారసు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ లో అభివృద్ధి కేంద్రీకృతమైన దృష్ట్యా రాజధానిని వికేంద్రీకరించాలని సూచించింది. అధికార వ్యవస్థలను విభజించాలని చెప్పింది. ప్రభుత్వ వ్యవస్థలను ఒక చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కీలక సూచన చేసింది..
*ఏపీకి హైదరాబాద్ లాంటి అతిపెద్ద రాజధాని అవసరం లేదని తేల్చింది. విజయవాడ-గుంటూరు, విశాఖ ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి రాయలసీమ ప్రాంతాలకు ప్రభుత్వ అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని శివరామకృష్ణ కమిటీ సూచించింది.
*హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఒకే చోట ఉండాలని లేదని చెప్పింది. హైకోర్టును ఓ చోట.. బెంచ్ లను మరో చోట ఏర్పాటు చేయాలని చెప్పింది. ఉత్తరాంధ్ర, సీమలకు ప్రభుత్వ వ్యవస్థలను విస్తరించాలని సూచించింది.
*సారవంతమైన మూడు పంటలు పండే గుంటూరు -విజయవాడ మధ్య పొలాలను రాజధానికి తీసుకోకుండా తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలంది. విజయవాడ-గుంటూరులో భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుందని.. అక్కడ రాజధాని వద్దని సూచించింది.
*విజయవాడ-గుంటూరు ప్రాంతం భూకంపక్షేత్రమని.. భారీ భవనాల నిర్మాణం సరైంది కాదని సూచించింది.