Begin typing your search above and press return to search.

21 రోజులు చాలన్నారు...100 రోజులైంది మోదీజీ : శివసేన

By:  Tupaki Desk   |   7 July 2020 5:00 PM GMT
21 రోజులు చాలన్నారు...100 రోజులైంది మోదీజీ : శివసేన
X
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయని, వైరస్ మహమ్మారిని అరికట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయని శివసేన పార్టీ విమర్శంచింది. కరోనా మహమ్మారీని జయించడానికి 21 రోజులు చాలన్నారు ..కానీ , ఇప్పుడు 100 రోజులు పూర్తి అయినా కూడా ఏం చేయలేకపోయారని విమర్శలకి దిగింది.

తన అధికారిక పత్రిక అయిన సామ్నా వేదికగా మోదీపై శివసేన ఫైర్ అయ్యింది. కరోనాపై పోరాటం చేసిన వాళ్లే అలసిపోయారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మహాభారత యుద్ధం కంటే కోవిడ్ మహమ్మారి మరింత ముదిరిపోయిందని, ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేదని, ఈ మహమ్మారి 2021 వరకూ ఇలాగే విజృంభిస్తుందని అభిప్రాయపడింది.

ఇది అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. సూపర్ పవర్‌గా భారత్ ఎదుగుతున్న క్రమంలో 24 గంటల్లోనే 25,000 కేసులు రావడం అత్యంత బాధాకరమని పేర్కొంది. . మోదీ వైఫల్యం కారణంగా కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ నంబర్ వన్ అయితీరేలా ఉందంటూ విమర్శలు కురిపించింది. మహారాష్ట్ర లో కోవిడ్ రోగులు కోలుకుంటున్నారని, అయితే థానే లాంటి ప్రాంతంలో మాత్రం పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉందని ప్రకటించింది. 2021లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదుకాబట్టి అప్పటిదాకా వైరస్ తో సహజీవనం తప్పేలా లేదని పేర్కొంది.

దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్ గా ఉన్న మహారాష్ట్రలో మంగళవారం నాటికి 2.12లక్షల కేసులు నమోదుకాగా, అందులో 9026మంది ప్రాణాలు కోల్పోగా, 1.15లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 87వేలుగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన గడిచిన 24 గంటల్లో దేశ్యాప్తంగా 22,771 కొత్త కేసులు, 467 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.2లక్షలకు, మరణాల సంఖ్య 20,198కి పెరిగింది