Begin typing your search above and press return to search.
థాక్రే నుంచి పార్టీ కూడా జారి పోయినట్లేనా ?
By: Tupaki Desk | 24 July 2022 5:56 AM GMTమహారాష్ట్రలో దశాబ్దాలు పాటు పట్టు కలిగున్న థాక్రే కుటుంబం నుండి శివశేన జారిపోతోంది. బాలాసాహెబ్ థాక్రే శివశేనను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దాదాపు ఐదుదశాబ్దాలుగా థాక్రే చేతిలోనే ఉన్న పార్టీ తాజా రాజకీయ పరిణామాల్లో ఏక్ నాథ్ షిండే చేతిలోకి మారబోతోంది. ఉత్థవ్ థాక్రే నాయకత్వంలోని పార్టీలో షిండే తిరుగుబాటు లేవదీసి పార్టీని చీల్చేసిన విషయం తెలిసిందే. ముందు పార్టీలో చీలిక తెచ్చి తర్వాత ప్రభుత్వాన్ని పడగొట్టి ఏకంగా షిండే ముఖ్యమంత్రే అయిపోయారు.
సీఎం అవ్వగానే షిండే దృష్టి పార్టీని లాగేసుకోవటంపై పడింది. వెనుకనుండి బీజేపీ సంపూర్ణమద్దతుంది కాబట్టి షిండే అనుకున్నవన్నీ చేయగలుగుతున్నారు. ఇందులో భాగంగానే తమదే శివశేన పార్టీ అని షిండే మొదలుపెట్టారు. దీనికి అభ్యంతరం వ్యక్తంచేస్తు థాక్రే కోర్టులో కేసువేయటంతో పాటు కేంద్ర ఎన్నికల కమీషన్ కు కూడా ఫిర్యాదులు చేశారు. ఇదే విధమైన కేసు, ఫిర్యాదు షిండే కూడా చేశారు. దాంతో ఇద్దరిలో పార్టీ ఎవరిదనే విషయమై తమ దగ్గరున్న ఆధారాలను చూపించాలని కమీషన్ కోరింది.
పార్టీలో మెజారిటి ఎవరికి ఉంటే వాళ్ళకే పార్టీ వెళ్ళిపోవటం ఖాయం. ఇపుడు శివసేన ప్రజాప్రతినిదుల్లో షిండేకు బలముంది. అలాగే పార్టీలో కూడా నేతలు చీలిపోతు మెజారిటి షిండేవైపు వెళ్ళిపోతున్నారు. దాంతో సాంకేతికంగా పార్టీ షిండేకి దక్కుతుందనే అందరు అనుకుంటున్నారు. అంటే థాక్రే కుటుంబానికి తొందరలోనే పార్టీతో అనుబంధం తెగిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.
థాక్రేని ఎలాగైనా దెబ్బకొట్టాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీనే పావులు కదుపుతోందని అందరికీ తెలుసు. తాను వెనుకుండి షిండేని ముందు పెట్టి నాటకాలు ఆడిస్తోంది. థాక్రేల చేతుల్లో శివసేన ఉన్నంతవరకు బీజేపీ మహారాష్ట్ర ప్రత్యేకించి ముంబాయ్ లో బలపడటం కష్టమన్నది కమలనాదుల ఆలోచనగా కనబడుతోంది. అందుకనే ముందు పార్టీని థాక్రేల చేతుల్లో నుండి లాగేస్తే తర్వాత జరగాల్సిన పని అదే జరిగిపోతుందన్న బీజేపీ వ్యూహం సక్సెస్ అవుతోంది.