Begin typing your search above and press return to search.
‘సీఎం’ అఖిలేశ్ కు ములాయం షాకిచ్చారు
By: Tupaki Desk | 14 Sep 2016 5:58 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో వారి కోసం ఎంతటి నిర్ణయమైనా తీసుకునే పరిస్థితి. అలాంటి రోజుల్లో అందుకు భిన్నంగా వ్యవహరించి షాకిచ్చారు సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. పార్టీ కోసం ఆయన కొడుక్కి షాక్ ఇచ్చేందుకు సైతం వెనుకాడకపోవటం ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సంచలనంగా మారింది. కుటుంబంలో చోటు చేసుకున్న రచ్చపై ములాయం ఇంత కరుకుగాఉండటం పట్ల కొందరు ఆయన్ను అభినందిస్తున్నా.. మరికొందరు ఆయన్ను తీవ్రంగా తప్పు పడుతున్నారు. ములాయం తమ్ముడు శివ్ పాల్ కూ.. ములాయం కుమారుడు.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ కు మధ్య ఏ మాత్రం పొసగని పరిస్థితుల్లో ములాయం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడో పెద్ద చర్చ సాగుతోంది.
అఖిలేశ్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి అయిన తన తమ్ముడు శివపాల్ సింగ్యాదవ్ కానీ రాజీనామా చేసిన పక్షంలో సమాజ్ వాదీ పార్టీ ముక్కలు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసిన ములాయం.. పరిస్థితి చక్కదిద్దేందుకు వీలుగా తన కుమారుడు అఖిలేశ్ ను పార్టీ అధ్యక్షుడి హోదా నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటన్నది చూస్తే.. ములాయం తమ్ముడు.. తనకు బాబాయ్ అయిన శివ్ పాల్ సింగ్ కు సన్నిహితుడైన దీపక్ సింఘల్ ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పదవి నుంచితప్పించారు. దీంతో అబ్బాయ్ పై బాబాయ్ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదిలా ఉండగా.. దీపక్ సింఘాల్ ను తప్పించి.. ఆ పదవిలో రాహుల్ భట్నాగర్ ను నియమించారు. ఈ జీవోను జారీ చేసిన గంటల వ్యవధిలోనే పార్టీ సుప్రీం ములాయం సీన్లోకి వచ్చి.. గంటల వ్యవధిలో కొడుకును పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదా నుంచి తప్పించి తన తమ్ముడ్ని ఆస్థానంలో కూర్చోపెడుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇలా తనకు ఏ మాత్రం పొసగని తన బాబాయ్ ను తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడిగా చేయటం అబ్బాయ్ ను దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందని చెబుతున్నారు. మరోవైపు అఖిలేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్తార్ పార్టీ విలీనానికి సంబంధించి పాజిటివ్ గా అడుగులు పడటం అఖిలేశ్ కుమింగుడుపడని వ్యవహారంగా చెప్పాల్సిందే. గతంలో మాఫియాగా వ్యవహరించి ఈ మధ్యనే రాజకీయ అవతారం ఎత్తిన ముఖ్తార్ అన్సారీకి చెందిన ఖౌమీ ఎక్తాదళ్ ను ఎస్పీలో విలీనం చేసేందుకు శివపాల్ చొరవ ప్రదర్శిస్తున్నారు. దీనికి అఖిలేశ్ అడ్డుపుల్ల వేయగా.. తాజాగా అందుకు భిన్నంగా జరుగుతుండటం అఖిలేశ్ కు ఇబ్బందికరంగా మారింది. పార్టీ కోసం అన్నట్లుగా కొడుక్కి షాక్ ఇచ్చేందుకు సైతం సిద్ధపడిన ములాయం కోరుకున్నట్లే పార్టీ వ్యవహారం చక్కబడుతుందా? లేక.. మరింత దారుణంగా తయారవుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి.