Begin typing your search above and press return to search.
అబ్బాయ్..బాబాయ్ ఒక్కటైపోయారు
By: Tupaki Desk | 20 Jan 2017 12:17 PM GMTఉత్తర్ ప్రదేశ్ లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయినట్లే కనిపిస్తోంది. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కు ఆయన బాబాయ్ శివ్ పాల్ యాదవ్ కు మధ్య అంతా సెట్ అయిందని తాజా పరిణామం స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగే నాయకుల తొలి జాబితాలో తన బాబాయికి అఖిలేష్ టికెట్ ఖరారు చేసేశారు. 191 మంది సభ్యులతో అఖిలేష్ తన లిస్ట్ ను విడుదల చేశారు. ఇందులో అనూహ్య రీతిలో శివ్ పాల్ యాదవ్ పేరు ఉండటంతో ఎస్పీలో ఇక రచ్చ ముగిసినట్లేనని చెప్తున్నారు.
ఉత్తరప్రదేశ్ తొలి మూడు విడతల ఎన్నికల కోసం ఈ జాబితాను ప్రకటించారు. గత నెలలో తన తండ్రి ములాయం విడుదల చేసిన జాబితానే మార్చి అఖిలేష్ విడుదల చేశారు. పాత లిస్ట్‌లో అఖిలేష్ సన్నిహితులకు ములాయం అవకాశం ఇవ్వలేదు. అయితే తాజా జాబితాలో అతుల్ ప్రదాన్ - అరవింద్ సింగ్ గోపె వంటి తన సన్నిహితులందరికీ యూపీ సీఎం చాన్సిచ్చారు. మొత్తం 403 సీట్లలో తాము 300 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించింది. మిగిలిన 103 స్థానాలు కాంగ్రెస్ కు కేటాయించనుంది. తన తొలి లిస్ట్ లోనే అఖిలేష్ తన బాబాయ్ శివ్ పాల్ కు అవకాశం కల్పించడం చూస్తే.. ఇద్దరి మధ్య విభేదాలు సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఈ వారం మొదట్లో సమాజ్ వాదీ చీఫ్ గా అఖిలేష్ నే గుర్తించిన ఎన్నికల సంఘం.. సైకిల్ గుర్తును ఆయనకే కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో దిగివచ్చిన ములాయం 38 మందితో తన జాబితాను అఖిలేష్ కు అందించారు. అందులో శివ్ పాల్ పేరు కూడా ఉంది. శివ్ పాల్ జశ్వంత్ నగర్ నుంచే పోటీ చేయనున్నారు. ఆయన కొడుకు ఆదిత్యకు మాత్రం అవకాశం దక్కలేదు. ఈ జాబితాలో అతిక్ అహ్మద్ లాంటి గ్యాంగ్ స్టర్స్ కు అఖిలేష్ చాన్సివ్వలేదు. గతంలో ములాయం విడుదల చేసిన జాబితాలో అతని పేరు ఉండటం గమనార్హం. అయినప్పటికీ ములాయం పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/