Begin typing your search above and press return to search.
ములాయం కొత్త పార్టీ ఎంట్రీ అదిరింది
By: Tupaki Desk | 6 May 2017 10:01 AM GMTఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ రెండు ముక్కలై...సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా పేరిట కొత్త పార్టీని పెడుతున్నట్లు ములాయం సింగ్ సోదరుడు, పార్టీ సీనియర్ నేత శివ్‌పాల్ యాదవ్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రకటన చేసిన మరుసటి రోజే కొత్త పార్టీ హల్ చల్ మొదలైంది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో సమాజ్ వాదీ (సెక్యులర్) పార్టీ పోస్టర్లు వెలిశాయి. ఈ రోజు ఉదయం ములాయం, శివపాల్ యాదవ్ లను అభినందిస్తూ కొత్త పార్టీ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ పై ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్ ల ఫొటోలు ఉన్నాయి.
ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ తన సోదరుడు ములాయం సింగ్ నేతృత్వంలో సమాజ్ వాదీ (సెక్యులర్) పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. శివ్ పాల్ స్వస్థలం ఎటావాలో, తన బావ అజంత్ సింగ్ యాదవ్ తో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. నేతాజీ(మూలాయం)కి పూర్వ గౌరవాన్ని తేవడానికి, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడానికి త్వరలోనే పార్టీని అధికారికంగా ప్రకటిస్తాం.. అని వెల్లడించారు. కాగా, తమ్ముడి ప్రకటనపై ఇప్పటివరకు ములాయం స్పందించలేదు. కాగా, ములాయం 1992లో సమాజ్‌వాద్ పార్టీని స్థాపించారు. కానీ గతేడాది పార్టీలో అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాల్చాయి. ములాయం కొడుకు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఒకవర్గం, ములాయం, అతడి సోదరుడు శివ్ పాల్ మరో వర్గంగా చీలిపోయారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ, బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో మూడు నెలల్లోగా సమాజ్ వాదీ పార్టీ పగ్గాలను ములాయంకు అప్పగించకపోతే కొత్త పార్టీని ప్రకటిస్తానని శివ్‌పాల్ కొంతకాలం క్రితం హెచ్చరించినా అఖిలేశ్ లెక్కచేయలేదు.
ఇదిలాఉండగా...బాబాయి శివపాల్ కొత్త పార్టీ ప్రకటనను స్వాగతిస్తున్నామని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ``కొత్తగా సెక్యులర్ పార్టీ ఏర్పాటు కావడం శుభ పరిణామం. అది ఎలా ఉండబోతున్నదనే విషయం నాకు తెలియదు. కానీ ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొన్న సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు మరో పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మాకు వెన్నుపోటుదారులను ఎలా గుర్తించాలో కూడా తెలుసు`` అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/