Begin typing your search above and press return to search.
బాబాయ్ చాలా సీరియస్ అయిపోయారే?
By: Tupaki Desk | 24 Oct 2016 11:37 AM GMTప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాల చూపూ ఉత్తరప్రదేశ్ రాజకీయాలవైపే ఉందని చెప్పాలి. ములాయం - అఖిలేష్ - శివపాల్ సింగ్ ల మధ్య యుద్దం తారాస్థాయికి చేరిపోయింది. అమర్ సింగ్ తిరిగి అడుగుపెట్టడం - శివపాల్ ను మంత్రి పదవి నుంచి తొలగించడం వంటి పరిణామాల తర్వాత సమాజ్ వాదీ పార్టీ దాదాపు నిట్టనిలువునా చీలిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పై ఆయన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ మాటల తూటాలు పేల్చారు. అమర్ సింగ్ కాలిగోటికి కూడా అఖిలేశ్ సరిపోడని పరుష వ్యాఖ్యలు చేయడంతొ మొదలైన ఈ మాటల తూటాలు - సమాజ్ వాది పార్టీని చీలుస్తానని - కొత్త పార్టీ ఏర్పాటుచేస్తానని తనతోనే అఖిలేశ్ స్వయంగా అన్నాడని చెప్పేవరకూ సాగింది. ఈ క్రమంలో అన్నయ్య ములాయాంతో ప్రత్యేకంగా భేటీ అయిన శివపాల్... తన గోడును వెల్లబుచ్చుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఏర్పడిన వివాదం విషయంలో ములాయంతో శివపాల్ యాదవ్ భేటీ అయ్యి భావోద్వేగానికి లోనయ్యారట. ఈ సందర్భంగా... "సమాజ్ వాది పార్టీకి నేను చేసిన సేవలు చిన్నవా అన్నయ్యా? అఖిలేశ్ ను సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా నియమించినప్పుడు నేను పూర్తి మద్దతిచ్చాను. కానీ, నన్ను అధ్యక్షుడిగా చేసినప్పుడు మాత్రం అది జీర్ణించుకోకుండా అతడు నా వద్ద ఉన్న ఇతర శాఖలు లాక్కున్నాడు. అఖిలేశ్ కన్నా నేను తక్కువ పనిచేశానా? నేను అమర్ సింగ్ తో టచ్ లో ఉన్నమాట వాస్తవమే.. అయితే, ఈ విషయం నేను ఎప్పుడూ దాచలేదు" అని అన్నయ్య ములాయం ముందు చెప్పుకున్నారట.
అదే సమయంలో మరోవైపు అఖిలేశ్ కూడా తండ్రి ములాయంకు గట్టి వివరణ ఇచ్చాడట. "పార్టీ చీఫ్ అయిన శివపాల్ ఏం చేశాడో అందుకు ప్రతిఫలమే ఇదంతా.. నేను మీవల్లే ఈ రోజు ఇంత పెద్ద స్థానంలో ఉన్నాను.. మీకు వ్యతిరేకంగా కుట్ర చేసేందుకు ఏ ఒక్కరినీ అనుమతించబోను.. ములాయంను గానీ, పార్టీనిగానీ బలహీన పరచాలని కుట్ర చేసేవారిపై వెంటనే చర్యలు తీసుకుంటాను" అని అఖిలేశ్ అన్నారట. దీంతో ఇప్పటికే పరిస్థితి దాదాపు చేయిదాటిపోతుందనే ఆలోచనలో ఉన్న ములాయాం మరోసారి వీరిద్దరితో కలిసి భేటీ అవనున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/