Begin typing your search above and press return to search.
అఖిలేష్ కు ఇది ఊహించని మద్దతే?
By: Tupaki Desk | 16 Oct 2016 6:27 AM GMTఎస్పీ అధినేత ములాయం ఇంగ్ యాదవ్ తనయుడు అఖిలేశ్ - తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ మధ్య ఇటీవల తలెత్తిన అంతర్గత పోరు సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అఖిలేశ్‌ను తొలగించి, ఆ స్థానంలో శివ్ పాల్ ను అధ్యక్షుడిగా ములాయం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోయిన అఖిలేశ్ తన కేబినెట్‌లో మంత్రి అయిన శివ్ పాల్ యాదవ్ శాఖలకు కోత పెట్టారు. దీంతో ఆగ్రహించిన శివ్ పాల్ యాదవ్ రాజీనామా చేశారు. అనంతరం ములాయం జోక్యం చేసుకొని ఆయన శాఖలు తిరిగి ఆయనకు కేటాయించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించడంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీంతో అబ్బాయి - బాబాయ్ ల మధ్య కోల్డ్ వార్ మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉందని కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా అఖిలేష్ కు ఊహించని మద్దతిచ్చారు శివ్ పాల్.
అఖిలేష్ కు శివ్ పాల్ నిజంగానే మద్దతిచ్చారా లేక వ్యూహంలో భాగంగా అలా ప్రకటించారానే విషయాలు పక్కనపెడితే... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు కచ్చితంగా ఇది ఊహించని మద్దతే అని చెప్పాలి. ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనే విషయం కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారంటూ ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించిన తరుణంలో... వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ మళ్లీ విజయం సాధిస్తే అఖిలేష్ ముఖ్యమంత్రి అవుతారు అని శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు. అదేవిదంగా తాను మాత్రం ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ పేరును ప్రతిపాదిస్తానని తెలిపారు. ఇది కచ్చితంగా అఖిలేష్ కు ఊహించని మద్దతే అని నుకోవాలి!
అయితే... వీరిద్దరి మధ్య గ్యాప్ కారణం గానే యూపీలో బీజేపీ బలపడుతోందనే వాదన మరోవైపు వినిపిస్తోంది. తాజాగా వెలువడిన సర్వేల్లో కూడా బీజేపీ, బీఎస్పీ ల కంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎస్పీ వెనుక బడటానికి ఈ రచ్చ కూడా ప్రధాన కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా బాబాయ్ ఇలా అబ్బాయికి ఊహించని మద్దతు ఇవ్వడంతో కారకర్తల్లోనూ, అభిమానుల్లోనూ ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదన తెరపైకి వస్తోంది! అయితే వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు సంబందించిన అభ్యర్ధుల ఎంపికలో కూడా వీరిద్దరూ ఒకేమాటపై ఉండాలనేది మరో సూచనగా ఉంది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/