Begin typing your search above and press return to search.
బాహుబలిని బీభత్సంగా వాడేశారు..రాయల్టీ ఏది?
By: Tupaki Desk | 1 Sep 2018 11:12 AM GMTసినిమా పాటలను - డైలాగులను కొందరు రాజకీయ నాయకుల అభిమానులు స్లోగన్ లు గా వాడుకోవడం మామూలే. మరికొందరు అభిమానులైతే ఏకంగా తమ తమ నేతలను ....సినిమా హీరోలతో పోల్చేస్తూ కటౌట్ లు - బ్యానర్ లు కట్టేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాను పొలిటిషియన్స్ విపరీతంగా వాడుకుంటున్న నేపథ్యంలో ఆ క్రియేటివిటీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. త్వరలో జరగబోతోన్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రకరకాల స్పూఫ్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు....కాంగ్రెస్ పార్టీపై బీజేపీ కార్యకర్తలు రూపొందించి బాహుబలి స్పూఫ్ వీడియో...సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాహుబలిగా మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ....భల్లాల దేవగా జ్యోతిరాదిత్య సింధియాలను స్పూఫ్ చేసిన ఆ వీడియో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఏడాది చివర్లో మధ్య ప్రదేశ్ - ఛత్తీస్ గఢ్ - రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే శివరాజ్ ను బాహుబలి గా వర్ణిస్తూ ఓ వీడియోను రూపొందించారు. అందులో సింధియాను భల్లాల దేవగా చూపించారు. కమల్ నాథ్ ను కట్టప్పగా చూపించారు. మోదీ తోడున్నంత వరకు బాహుబలిని ఎవరూ ఏమీ చేయలేరని, భల్లాల పై బాహు విజయం సాధిస్తాడని ఆ వీడియో సారాంశం. ఇక, శివరాజ్ ...బాహుబలిగా శివలింగం ఎత్తడం చూసి....సోనియా - రాహుల్ లు అవాక్కయినట్లు చూపడం కొసమెరుపు. ఈ వీడియో కోసం మోదీ - శివ్ రాజ్ లు ప్రసంగించిన వీడియో క్లిప్స్ ను కూడా వాడేశారు. అయితే, ఈ వీడియో క్రెడిట్స్ రాజమౌళికి ఇవ్వాలని, తన సినిమా బాహుబలి ది కంక్లూజన్ లోని సీన్లను వాడుకున్నందుకు రాయల్టీ కూడా చెల్లించాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.