Begin typing your search above and press return to search.
తలకిందులుగా వేలాడదీస్తా...సీఎం వార్నింగ్!
By: Tupaki Desk | 24 July 2017 4:25 PM GMTఅధికారుల పనితీరు నచ్చకపోతే సమావేశాలు పెట్టి విమర్శించే సీఎం లను చూశాం. వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టి అధికారుల తలంటే ముఖ్యమంత్రుల గురించి విన్నాం. కానీ, మధ్య ప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహన్ రూటే సెపరేటు. రాష్ట్రంలోని కలెక్టర్లపై శివ్ రాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారందరికీ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని రెవెన్యూ కేసులను నెలలోపే విచారించకపోతే సంబంధిత అధికారులను తలకిందులుగా వేలాడదీస్తానని తీవ్రంగా హెచ్చరించారు. సాక్ష్యాత్తు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది.
భోపాల్ లో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ ఫిర్యాదుల అంశాన్ని బీజేపీ నేతలు లేవనెత్తారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సీఎంను కోరారు. దీంతో, శివరాజ్ సింగ్ చౌహాన్ కలెక్టర్లపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ కేసులను నెలలోపే విచారించాలని, నెల గడిచినా ఏదైనా రెవెన్యూ కేసు పెండింగ్ లో ఉన్నట్టు తెలిస్తే.. ఆ కేసుకు సంబంధించిన రెవెన్యూ అధికారులను తలకిందులుగా వేలాడదీస్తానని హెచ్చరించారు. నవంబర్ నెలలో సీఎం చౌహాన్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ల పూర్తి కానున్న నేపథ్యంలో జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. అప్పటిలోగా రెవెన్యూ కేసులను నిర్దిష్ట గడువుతో పరిష్కరించకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.
మరోవైపు కలెక్టర్లపై ముఖ్యమంత్రి అభ్యంతరకరమైన భాష ఉపయోగించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటానని మాత్రమే శివరాజ్ సింగ్ అన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అధికారికంగా ఈ విషయంపై బీజేపీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. వ్యవసాయ - రెవెన్యూ శాఖలు అవినీతిలో కూరుకుపోయాయని ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఆరోపించారు. బీజేపీ తప్పుడు విధానాల వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. రైతుల అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకే కలెక్టర్ల పై సీఎం అటువంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అధికారులు, కలెక్టర్లను బీజేపీ ఒత్తిడికి గురిచేస్తోందని, అధికారులు నిర్భయంగా పనిచేసే వీలు కల్పించాలని ఆయన అన్నారు.